iDreamPost

700 పోస్టుమార్టంలలో పాల్గొన్న మహిళకు అయోధ్య ఆహ్వానం!

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. జనవరి 22న ఆలయంలో రామయ్యకు ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించనున్నారు.

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. జనవరి 22న ఆలయంలో రామయ్యకు ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించనున్నారు.

700 పోస్టుమార్టంలలో పాల్గొన్న మహిళకు అయోధ్య ఆహ్వానం!

అయోధ్యను పాలించే రామయ్య తండ్రి.. తనకు కావాల్సిన వారందరిని వేడుకకు ఆహ్వానిస్తున్నాడు. కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న రామ జన్మ భూమిలో సాక్షాత్తు ఆ శ్రీ రామ చంద్రుడు.. కొలువు తీరబోతున్నారు. కొన్ని వేల యుగాల క్రితం జరిగిన రామయ్య పట్టాభిషేక వైభోగం.. మరలా ఇప్పుడు కనిపించనుంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఆ మహత్తర సన్నివేశాన్ని ఎపుడెపుడు కళ్లారా చూస్తామా అని.. కొన్ని కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. జనవరి 22వ తేదీన జరగబోయే రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం.. దేశంలోని ఎంతో మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలను అందచేస్తున్నారు. తాజాగా మార్చురీలో పని చేసే ఓ మహిళకు కూడా అయోధ్య ఆహ్వానం అందింది. దీంతో ఆమె సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరి.. ఆమె ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. జనవరి 22న ఆలయంలో రామయ్యకు ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి టీవీ ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు..రోజూ వివిధ కార్యక్రమాలు అయోధ్య నగరంలో జరగనున్నాయి. ఇక స్వామి వారి ప్రాణ ప్రతిష్ట వేడుకకు దేశ వ్యాప్తంగా 11 వేల మంది ప్రముఖులను అయోధ్య రామ మందిర ట్రస్ట్ వారు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి కూడా అయోధ్య ఆహ్వానం అందింది. ఇక రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అతిథులుక అతి సామాన్యులకు కూడా అవకాశం దక్కింది.

తాజాగా ఓ వైద్య సహాయకురాలికీ  కూడా ఆహ్వానం అందింది. 700 పోస్టుమార్టంలలో పాల్గొన్న ఆ వైద్య సహాయకురాలికీ రామమందిర ట్రస్టు నుంచి ఆహ్వానం అందింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన సంతోషి దుర్గ అనే మహిళ నర్హర్ పుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సహాయకురాలిగా పని చేస్తున్నారు. ఆమె ఈ వృతిలో దాదాపు 18 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా ఆమె దాదాపు 700 పోస్టుమార్టంలలో పాల్గొన్నారు. అక్కడి స్థానిక ఆస్పత్రిలో మార్చురీ అసిస్టెంట్ గా ఆమె చేసిన సేవలకు ప్రశంసలు కూడా దక్కాయి. అంతేకాక ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా అనేక సత్కారాలు కూడా అందుకున్నారు.

తాజాగా సంతోషి దుర్గా మరో అరుదైన గుర్తుంపును, అవకాశాన్ని దక్కించుకున్నారు. రాముల వారి మందిర ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించనున్నారు. అందుకు కారణం.. ఎంతో మంది ప్రముఖలతో పాటు  సంతోషి దుర్గ కి కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. దీనిపై దుర్గా సంతోషంతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పిలుపు ఎన్నడూ ఊహించలేదని.. ఆ శ్రీరాముడే తనను ఆశీర్వదించి.. పిలిచారని ఆమె చెప్పుకొచ్చారు. రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వేల మంది అయోధ్య నగరానికి చేరుకున్నారు. ఈ వేడుకకు  పౌర పురస్కార గ్రహీతలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు, జైన, మత పెద్దలు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన మాజీ అధిపతులు ఉన్నారు.

అలానే నోబెల్‌, భారతరత్న అందుకున్న వారితోపాటు ఇతర  ఉన్నతాధికారులు, మేధావులును అహ్వానించారు. అలానే రామ జన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కుటుంబీకులు ఆహ్వానం ఉన్నట్లు ఆలయ ట్రస్ట్‌ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా అయోధ్య ఆలయ నిర్మాణానికి  న్యాయస్థానం పరంగా పోరాడిన లాయర్లకూ ఆహ్వానం అందినట్లు సమాచారం. మొత్తంగా ఓ మార్చురీలో పని చేసే మహిళకు ఈ అరుదైన అవకాశం లభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి