iDreamPost

ఇల్లాలు నల్లగా ఉందని విడాకులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ వీటి సంఖ్య బాగా పెరిగిపోతుంది. తాజాగా తన భార్య నల్లగా ఉందని విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ వీటి సంఖ్య బాగా పెరిగిపోతుంది. తాజాగా తన భార్య నల్లగా ఉందని విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇల్లాలు నల్లగా ఉందని విడాకులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ప్రస్తుతం కోర్టుల దృష్టికి విచిత్రమైన కోసులు వస్తుంటాయి. ముఖ్యమంగా భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలకు కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. భార్యలు వేధిస్తుందని భర్తలు కోర్టుకి వెళ్తుంటారు. అలానే భర్తలు వరకట్నం వంటి ఇతర వేధింపులతో గురిచేస్తున్నారని భార్యలు కోర్టు గడప తొక్కుతుంటారు. కొందరు విచిత్రమైన కారణాలతో విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్తుంటారు. అలాంటి వారికి విషయంలో న్యాయస్థానాలు కూడా కీలక  వ్యాఖ్యలు చేస్తుంటాయి.తాజాగా భార్య నల్లగా ఉందని విడాకులు ఇవ్వాలని ఓ వ్యక్తి కోరగా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఓ వ్యక్తి.. తన భార్య  నల్లగా ఉందని చెబుతూ విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. అతడి పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది. 2005లో వివాహమైన సదరు వ్యక్తి వివాహం అయ్యింది. ఆ తరువాత కొంతకాలానికి ఫ్యామిలో కోర్టులో విడాకులు కోరుతు పిటిషన్ వేశాడు. ఆ అతడి పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు తిరష్కరించింది. దీంతో అతడు హైకోర్టులో అప్పిల్ చేసుకున్నాడు. తాజాగా అతడి విడాకుల పిటిషన్ తిరస్కరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

శుక్రవారం ఛత్తీస్ గడ్ హైకోర్టులో విచారణ సందర్భంగా తన భార్య, తనను విడిచి వెళ్లినట్లు భర్త వాదించాడు. అయితే తన నలుపు రంగు కారణంగా తన భర్త వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఇంటి నుంచి గెంటేసినట్లు భార్య తెలిపింది. దీంతో ఆమె తరపునే నిలిచిన కోర్టు సదరు వ్యక్తికి చివాట్లు పెట్టింది. ఈ కేసులో తీర్పు ద్వారా చర్మం ఆధారంగా విడాకులను ఎంపిక చేసుకుని మనస్తత్వాన్ని ప్రోత్సహించలేమని న్యాయమూర్తిలు జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చర్మ రంగు ఆధారంగా వివక్షను నిర్మూలించాలని న్యాయస్థానం పిలుపు నిచ్చింది.  చర్మం రంగు ప్రాధాన్యతను ప్రోత్సహించలేమని  న్యాయస్థానం పేర్కొంది. వివాహ సమయంలో భాగస్వామ్యుల ఎంపికవ విషయంలో చర్మం రంగు ప్రాధాన్యత గురించి లోతైన అధ్యయనాలను కోర్టు ప్రస్తావించింది.

ముదురు రంగు చర్మం గల వారిని తక్కువగా చూపించడం, చర్మాన్ని కాంతివంతం చేసే సాధానాలు ఎక్కువ భాగం మహిళలను లక్ష్యంగా చేసుకుంటాయని కోర్టు తెలిపింది. చర్మం రంగు కలిగిన స్త్రీలను తక్కువ కాన్ఫిడెంట్ గా చూపించే ప్రయత్నం చేయడంతో వారు విజయం సాధించలేరని కోర్టు పేర్కొంది. కాబట్టి నల్లటి రంగు కంటే ఫెయిర్ స్కిన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలనే సమాజం మనస్తత్వం మారాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో భర్త విడాకులను ఆమోదించలేమని న్యాయస్థానం చెప్పింది. మరి.. కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి