iDreamPost

చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం.. ఫ్యూచర్ క్రికెటర్ల కోసం ఏకంగా..!

  • Author singhj Published - 10:38 AM, Fri - 18 August 23
  • Author singhj Published - 10:38 AM, Fri - 18 August 23
చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం.. ఫ్యూచర్ క్రికెటర్ల కోసం ఏకంగా..!

చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో మోస్ట్ సక్సెస్​ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిచిన సీఎస్​కేకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెన్నై జట్టు మ్యాచ్ ఆడుతోందంటే చాలు.. ఏ వేదికలోనైనా స్టేడియం నిండిపోవాల్సిందే. ప్లేయర్లను ఎంకరేజ్ చేయడానికి ఎల్లో ఆర్మీ చేసే హంగామా అంతా ఇంతా కాదు. సీఎస్​కే గ్రౌండ్​లోకి దిగిందంటే ఎదురుగా ఎంత బలమైన ప్రత్యర్థి ఉన్నా భయపడాల్సిందే. పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకపోయినా అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించుకుంటూ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైని నడిపించే తీరు అద్భుతమనే చెప్పాలి.

ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ నెగ్గి జోష్​లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో క్రికెట్ అకాడమీని ప్రారంభిచాలని డిసైడ్ అయింది. తమిళనాడులోని తిరుప్పూర్​లో మొదలుపెట్టనున్న ఈ అకాడమీకి ‘సూపర్ కింగ్స్ అకాడమీ’ అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించింది. చెన్నై నగరానికి 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాలి స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్​లో ఈ కొత్త అకాడమీని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్​కే యాజమాన్యం తెలిపింది. ఫ్యూచర్ క్రికెటర్లకు ఇంటర్నేషనల్ లెవల్లో ఫెసిలిటీస్​ ఇక్కడ లభించనున్నాయని పేర్కొంది.

సీఎస్​కే ఏర్పాటు చేస్తున్న కొత్త అకాడమీలో మొత్తం ఎనిమిది పిచ్​లను ఏర్పాటు చేశారట. ఇప్పటికే ఫ్లడ్​లైట్లు సహా ఇతరత్రా సదుపాయాలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. 6 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చట. కొత్త అకాడమీకి సంబంధించిన విశేషాలను సీఎస్​కే సీఈవో కాశీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో సత్తా ఉన్న కుర్రాళ్లను వెలికి తీయడమే తమ టార్గెట్ అని విశ్వనాథ్ తెలిపారు. చెన్నైతో పాటు సాలెం, హోసూర్, తిరుచ్చి, తిరునల్వేలిలో సెంటర్లు రన్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడికి అత్యుత్తమ కోచ్​లను తీసుకొస్తామని.. ఇది గొప్ప విజయమని యాలి స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విష్ణు గోవింద్ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి