iDreamPost

చంద్రముఖిలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చంద్రముఖి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. బాబా తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..?

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చంద్రముఖి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. బాబా తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..?

చంద్రముఖిలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తమిళ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో ఒకటి చంద్రముఖి. ఈ చిత్రం వచ్చి దాదాపు ఇరవయేళ్లకు దగ్గర పడుతుంది. అయినప్పటికీ.. విశేష ఆదరణ చూరగొంటుంది. టీవీల్లో వస్తుంటే.. చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. బాబా వంటి డిజాస్టర్ తర్వాత రజనీ నుండి వచ్చిన ఈ చిత్రం ఆయనకు మంచి కమ్ బ్యాక్‌గా నిలిచింది. ఒకానొక దశలో రజినీ చివరి సినిమా బాబా అని, ఆయన ఇక సినిమాలు చేయరంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆయన చంద్రముఖితో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. కథ, కథనం కొత్తగా ఉండటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇది మణిచిత్రతాయు అనే మలయాళ చిత్రానికి రీమేక్ అయినా.. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే.. ఆ సినిమా గురించి తెలిసింది. పి వాసు దర్శకత్వంలో ఈ పిక్చర్ సుమారు ఏడాదిపాటు థియేటర్లలో ఆడింది.

ఈ సినిమాలో ప్రభు, జ్యోతిక, నయనతార, మాళవిక,నాజర్, మనోబాల, కెఆర్ విజయ, సోనూ సూద్, విజయ్ కుమార్ వంటి దిగ్గజ నటులున్నారు. ఇందులో పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇందులో అత్తిదోంమ్ సాంగ్ గుర్తుంది కదా.. అందులో చిన్న పిల్ల కూడా రజినీతో కలిసి పాడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా.. ఆ పాప ఈమెనా అని ఆశ్చర్య పోవడం ఖాయం. అప్పట్లో బొద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టైలిష్ లుక్‌లో హీరోయిన్లకు పోటీ అవుతుంది. ఇంతకు ఆ పాప పేరు ఏంటంటే.. ప్రహర్షిత. చంద్రముఖి మూవీలో బొమ్మి అనే క్యారెక్టర్‌లో నటించింది. ఇవే కాకుండా వేలన్, రాజ రాజేశ్వరి, సెల్వీ వంటి చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది ఈ చిన్నారి.

అయితే ప్రహర్షిత.. 2021లో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. కాగా, ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత ఆమె ఓ సీరియల్లో నటిస్తోంది. సుమారు 18 ఏళ్ల తర్వాత ఆమె ముఖానికి మేకప్ వేసుకుంది. రాధిక కీలక పాత్రలో నటిస్తోన్న తమిళ సీరియల్ తాయమ్మ కుడుంబత్తార్ లో నటిస్తోంది. ఈ ధారాహహిక డీడీ తమిళ్ లో ప్రసారం అవుతుంది. అందులో ఓ కీ రోల్ ప్లే చేస్తోంది ప్రహర్షిత. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈ క్యూటీ.. తన పాప, టూర్స్ ఫోటోలతో పాటు.. తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ షేర్ చేస్తూనే ఉంది. పెళ్లి అయిపోంది కానీ.. ఆమె హీరోయిన్ మెటీరియల్. ఏమాత్రం అందం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ధారావాహికలో నటిస్తోంది. మళ్లీ వెండితెరపై కనిపిస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Praharshetha (@official_bommi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి