iDreamPost

తెలంగాణలో చంద్రబాబు సాయం రేవంత్‌కా..పవన్‌కా?

తెలంగాణలో ఎన్నికల వాతావరణం చాలా హీట్ గా ఉంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం చాలా హీట్ గా ఉంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణలో చంద్రబాబు సాయం రేవంత్‌కా..పవన్‌కా?

తెలంగాణలో ఎన్నికల వాతావరణం చాలా రసవత్తరంగా ఉంది. నేటితో నామినేషన్లు ముగియనున్నాయి. ఇక గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇది ఇలా ఉంటే… తెలంగాణ ఎన్నికల  ఏపీ రాజకీయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా  టీటీడీపీ అంశం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక్కడ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పీసీసీగా ఉన్నాడు. ఏపీలో తమతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా ప్రత్యర్థులు గా ఉన్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు సాయం రేవంత్ కా లేదా పవన్ కా అనే  సందేహం అందరిలో వ్యక్తమవుతుంది.

తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్లే భావించాలి. కారణం..గతంలో టీడీపీ కనీసం కొన్ని స్థానాల్లో పోటీ చేసి.. సీట్లును సైతం గెలుచుకుంది. అయితే ఈ సారి పోటీ నుంచి తప్పుకుంది. అంతేకాక ఇక్కడ టీడీపీ రూపం మార్చుకుని బీఆర్ఎస్ గా మారిందనే వాదన లేకపోలేదు. కారణం.. బీఆర్ఎస్ లో ఉండే ఎక్కువ మంది నేతలు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. గులాబీ బాస్ తో సహా ఎక్కువ మంది టీడీపీ మాజీ నేతలే. టీడీపీ లోని మరోవర్గం చంద్రబాబుకి ముఖ్యడు, శిష్యుడైన రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నారు. టీడీపీ డౌన్ ప్లే అవ్వడంతో పునరావాసం కోసం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించాడని పొలిటికల్ సర్కిల్ లో వినిపించే వార్త.

రేవంత్ రెడ్డే ప్రస్తుతం టీ పీసీసీ అధ్యక్షుడు, ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే..  ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా అయ్యే అవకాశం ఉంది.  ఇలా  చంద్రబాబుకు చెందిన రెండు వర్గాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ ఎవరికి అధికారికంగా మద్దతు ఇవ్వలేదు. అయితే తెలంగాణలో ఉన్న టీడీపీ కేడర్ ఎవరికి మద్దతు ఇస్తుందనేదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పటి దాక టీటీడీపీ  అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ .. ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.

ఇది ఇలా ఉంటే ఇక్కడ మరో అంశం ఏమిటంటే…పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. దీపావళి తరువాత నుంచి కలిసి కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. మరి.. ఏపీలో ఉన్న టీడీపీ, జనసేన పొత్తు, తెలంగాణలో ఎందుకు లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పవన్ కల్యాణ్ 8 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అది కూడా టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తుంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆశీస్సులు శిష్యుడైన రేవంత్ కి ఉంటాయా? లేదా ఏపీలో మిత్రపక్షమైన జనసేనాకి ఉంటాయా? అనే సందేహాలు ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్నాయి. మరి.. ఆయా నియోజకవర్గాలో గెలిచే అభ్యర్థులను బట్టి ఓ అంచనాకు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. టీడీపీ, బాబు మద్దతు ఎవరికి ఇచ్చారు అన్నది తెలియాలంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. తెలంగాణలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి