iDreamPost

ACB కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..!

ACB కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనే షాకులు తిన్న బాబుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. అలానే నేడు ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. ఉదయం హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగలగా.. మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ ను, సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు  పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 5వ తేదీన ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. అలానే సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే 6వ తేదీన మరికొన్ని అంశాలను  ఆయన న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. అనంతరం బెయిల్ పిటిషన్ పై  ముగిసి.. తీర్పును నేటికి వాయిదా వేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందని, బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరపున వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.

ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అలానే సీఐడీ దాఖలు చేసిన కస్డడీ పిటిషన్ పైనా వాదనలు జరిగాయి.  ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ ను కూడా డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే.. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం రెండు పిటిషన్లను డిస్మిస్ చేసింది. మరి.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కొట్టేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి