iDreamPost

జనానికి దూరంగానే బాబు

జనానికి దూరంగానే బాబు

ప్రజాస్వామ్యంలో జనానిదే పైచేయి. వారనుకున్నదే జరుగుతుంది. వారి అభీష్టం మేరకే అన్నీ. కానీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదా సాధించుకున్న మాజీ సీయం నారా చంద్రబాబునాయుడు మాత్రం. జనానికి దూరంగానే కొనసాగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన చుట్టూ ఉండే కోటరీయే ఆయన్ను జనానికి, ముఖ్యంగా సొంత పార్టీ కేడర్‌కు దూరం చేస్తుందంటూ కన్విన్సింగ్‌ వాదనలు కొన్ని తరచు విన్పిస్తుంటాయి. అయితే ఇది కేవలం కోటరీ తప్పు కాదని, స్వయంగా చంద్రబాబు నాయుడుగానే ఆ విధంగా కోటరీని ఏర్పరచుకున్నారన్న భావనకు ఇటీవలి కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలిస్తున్నాయి.

కరోనా మహమ్మారి భారిన పడి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆయనేమో పక్కరాష్ట్రంలో కూర్చున్నారు. పోనీలే అక్కడ

ఇరుక్కుపోయారనుకుందామనుకున్నా.. కనీసం సొంత పార్టీ కేడర్‌నైనా సమాయత్తపరిచి చేతనైన విధంగా సాయం చేయండి అని పోత్రహిస్తారేమోననుకుంటే కనీసం అటువంటి ప్రయత్నం కూడా చేయాలేదాయె. ఇటీవల జరిగిన సొంత పార్టీ మహానాడులో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు, జనం బాగోగులు, పార్టీ లక్ష్యాల గురించి మాట్లాడతారనుకుంటే సీయం వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికే మొదటి ప్రాధాన్యమిచ్చారు. దీంతో సొంత పార్టీ శ్రేణుల్లోనే నైరాశ్యం నెలకొందాయె.

రాష్ట్రాలు దాటి వచ్చేవాళ్ళకు కోవిడ్‌19 పరీక్షలు చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొన్న హైదరాబాదు నుంచి ఏపీకి వచ్చే సమయంలో సదరు టెస్టులు చేయించుకోకుండా తన దర్పాన్ని ప్రదర్శించడం చూస్తుంటే సగటు మనుషులకు చేసేవి.. మాకు చేస్తారా? అన్న భావన వ్యక్తమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యక్షంగా ఇలా ఉంటే.. సోషల్‌ మీడియాలో సైతం జనానికి, చంద్రబాబుకు ఉన్న అంతరం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ఆయన ట్వీట్లు కూడా బూమరాంగ్‌ల మాదిరిగి తిరిగి ఆయనకే వస్తున్నాయి. ‘పరిస్థితి చేయిదాటిపోయింది.. పంథా మార్చుకుంటే తప్ప.. లేకపోతే కష్టమే’నంటూ ఇటువంటి సంఘటనలన్నీ చూసిన వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి