iDreamPost

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ!

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ!

సుప్రీం కోర్టులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల9కి  వాయిదా వేసింది. గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా పెట్టిన కేసు కొట్టి వేయాలని చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసుల్ని కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేశారు. మంగళవారం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. సీఐడీ తరపున అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రొహిత్గి వాదనలు వినిపించారు. అలానే చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వర్చల్ విధానంలో తన వాదనలు వినిపించారు. ప్రధానంగా సెక్షన్ 17Aపై చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు వినిపించారు.

సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాడివేడీ వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు తమ వాదనలు బలంగా కోర్టు ముందు వినిపించారు. సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదిస్తూ.. ఈ కేసు 2017 కంటే ముందే మొదలైందని, అప్పుడే దీన్ని సీబీఐ పరిశీలించిందని, కాబట్టి ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారని కోర్టుకు విన్నవించారు. దర్యాప్తు మొదలైంది ఈ ప్రభుత్వం రాకముందే అని దర్యాప్తు ప్రారంభమైందని ముకల్ ధర్మాసనానికి తెలిపారు. అంతకు ముందు చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకార చర్యలు నివారించడానికి సెక్షన్ 17 తీసుకొచ్చారని..ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా ?లేదా? అన్నదే ప్రధానమన్నారు.

అనంతరం అభిషేక్ సింఘ్వీ వాదించారు. అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. తామను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, ఇప్పటికిప్పుడు కేసును క్వాష్ చేయాలన్న అంశంపై ఆసక్తిచూపించడం లేదని తెలిపింది. ఈ కేసులో ఇంకా పరిశీలించాల్సిందేమీ లేదని, ఈ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇరుపక్షాలు వచ్చే వారానికి అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి