iDreamPost

చంద్రబాబు, లోకేశ్ లు నిన్నటి నుండే నాపై దాడికి కుట్ర పన్నారు..

చంద్రబాబు, లోకేశ్ లు నిన్నటి నుండే నాపై దాడికి కుట్ర పన్నారు..

అమరావతిలో ఈరోజు SRM యూనివర్సిటీ, CII ల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇండస్ట్రియల్ అకాడమియా సమిట్’ కు తానూ ముఖ్య అతిధి గా హాజరవుతున్నట్టు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు రెండు రోజుల ముందు నుండే చంద్రబాబు నాయడు తన మీద దాడి చేయించడానికి పధకం పన్నారని, దానికి సంబంధించి ముందస్తుగానే పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో ఆదేశాలు జారీ చేశారని రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.

SRM యూనివర్సిటీ, CII ల సమ్మిట్ కు హాజరుకావడానికి తానూ వస్తున్న విషయం తెలుసుకొని, దారిలోని పెద్ద పరిమి గ్రామం వద్ద రాజధాని రైతుల ముసుగులో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు తన కారునికి అడ్డగించి, ఒక మహిళను అని కూడా చూడకుండా తనను నడిరోడ్డు మీద నిర్బంధించి ఇష్టం వచ్చినట్టు దూషణలకు దిగారని ఆమె వాపోయారు. వాస్తవానికి పెద్దపరిమి గ్రామం రాజధాని పరిధిలో లేకపోవడం విశేషం. రాజధాని రైతులు నిరసన చెయ్యాలనుకుంటే,రాజధాని కడతానని చెప్పి ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా రైతులను మోసం చేసిన చంద్రబాబు ఇంటిముందే నిరసన చెయ్యాలని, మొదట ఆయన్నే నిలదీయాలని రాజధాని రైతులకు రోజా సూచించారు.

మొన్న మాచర్ల ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణా రెడ్డి పైన, ఎంపీ నందిగాం సురేష్ మీద జరిగిన దాడి కానీ నిన్న ఎమ్మార్వో మీద, ఈరోజు తనమీద జరిగిన దాడి కానీ.. దీనివెనుక చంద్రబాబు, లోకేష్ లా కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి గారు రాజధాని రైతులకు 10 సంవత్సరాలకు ఇవ్వాల్సిన కౌలు ను 15 సంవత్సరాలకి పెంచారని, రాజధాని రైతు కూలీలకు ప్రతి నెల ఇస్తున్న రెండువేల ఐదువందల రూపాయల భృతిని ని ఐదు వేలకు పెంచారని, అసైన్డ్ రైతులకు కూడా ఫ్లాట్లు ఇస్తున్నారని రోజా తెలిపారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు చంద్రబాబు మాటలని నమ్మి మోసపోవద్దని సూచించారు.

సీఆర్డీఏ ని కాస్త చంద్రబాబు రిలేషన్స్ డవలెప్మెంట్ అధారిటీ గా మార్చిన చంద్రబాబు, ఆయన కుటుంబం తో పాటు ఆయన హాయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని పరిధిలో నాలుగు వేల కోట్లు భూములను దోచుకున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం పేరుతొ చంద్రబాబు ఒక సామాజిక వర్గానికి రాజధానిలో భూములు దోచిపెట్టి, ఇప్పుడు తన సామాజిక వర్గం వారిని రెచ్చగొట్టి, రెండు సామాజిక వర్గం చానెళ్లతో జగన్ మోహన్ రెడ్డిని బండ భూ తులు తిట్టిస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రతిపక్ష నేత తన వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని, తానూ చేస్తున్న ప్రజా చైతన్య యాత్ర ని అడుగు కూడా ముందుకు సాగనివ్వబోమని రోజా హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి