iDreamPost

ముఖ్యమంత్రిని బలివ్వాలా వద్దా? చంద్రబాబు అనుచిత వాఖ్యలు.

ముఖ్యమంత్రిని బలివ్వాలా వద్దా? చంద్రబాబు అనుచిత వాఖ్యలు.

సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయనాయకులు ఈ మధ్యకాలంలో రోజు రోజుకు మరింత దిగజారి పోతున్నారు . వారు వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా తయరైంది. దీనికి తాజా నిదర్శనం చంద్రబాబు వాడిన ఈ పరుష పదజాలం. రాజధాని పేరిట చంద్రబాబు చేస్తున్న పోరాటంలో ప్రజల సమస్యల కన్నా ముఖ్యమంత్రి జగన్ పై ఆయనకి ఉన్న విద్వేషమే ఎక్కువగా కనిపిస్తున్నది.

ముఖ్యమంత్రి పై పరుష పదజాలం వాడి , వాడించి తన అక్కస్సుని తీర్చుకోవటానికే రాజధాని ఉద్యమం అనే అంశాన్ని పైకి తెచ్చారా అనే భావన కలిగేలా ఉంది చంద్రబాబు వాడుతున్న భాషని చూస్తే ప్రజా జీవితంలో ముఖ్యంగా రాజకీయల్లో ఉన్నప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి పద ప్రయోగం చేయటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే నాయకులుగా చలామణి అయ్యే వారికి అభిమానులు , అనుచరులు ఉండటం సహజం, తమ అభిమాన నేతే విద్వేష పూరితమైన భాష ప్రయోగించినప్పుడు ఇరువైపుల అనుచరులు అభిమానులు మరింత రెచ్చిపోయి దాడులు ప్రతి దాడులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలే ఎక్కువ.

ప్రజల మధ్య ఉండి ఇలాంటి భాష వాడటం చంద్రబాబుకు కొత్త కాదు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని గొడ్డల్లతో కొడవళ్లతో నరకండి అని ఒక బడా ఫ్యాక్షన్ నేత లా చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్ళీ అధికారం పోగొట్టుకున్న రోజు నుంచే జగన్ పై ఉన్మాదని , ఉగ్రవాది అని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. ఇది కాస్తా శ్రుతిమించి ఇప్పుడు ఏకంగా బలివ్వాలా వద్దా అంటు బౌతిక దాడులకు అభిమానులని ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో దేశంలోనే నాకన్న సీనియర్ లేడు అని చెప్పుకుంటూ ఇలాంటి వాఖ్యలు చేస్తుంటే వారి నుండి ప్రేరణ పొందిన జనసేన నేత కూడా మొన్నామద్య ఏకంగా తలలు నరుకుతాం అని బహిరంగంగా హెచ్చరించే స్థాయికి వచ్చారు. చంద్రబాబు మాటలకు ప్రతిస్పందిస్తు వై.సి,పి నేత ద్వారంపుడి చంద్రశేఖర్ కూడా అసభ్య పదజాలం ఉపయొగించి ప్రశాంతంగా ఉండే కాకినాడ లో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు.

నేతలు విలువలు మరిస్తే సభ్యసమాజం చీదరించుకుంటుందన్న జ్ఞానం కూడా లేకుండా సీనియర్ అని చెప్పుకుoటున్న చంద్రబాబు ఇలా మాట్లాడటం శోచనియం. చంద్రబాబు చేసిన ఈ వాఖ్యలు ప్రతిపక్ష హోదా స్థాయిని బజారున పడేశాయి అనటంలో సందేహం లేదు. ఇప్పటికైనా నేతలు మాట్లాడే సమయంలో హుందాతనం ప్రదర్శిస్తే రాజకీయాల్లో విలువులు పెంపొందించిన వారౌతారు. ప్రజా క్షేత్రంలో ఉండి విద్వేష పూరితంగా వ్యవహరిస్తే సమాజంలో అశాంతికి అనిచ్చితికి బీజం వేస్తుందని నేతలు గుర్తించి సహనశీలతను, శాంతిని పెంపొందించుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి