iDreamPost

చీరాల తెలుగుదేశానికి ఆపద్భాంధవుడుగా యడం బాలాజీ.

చీరాల తెలుగుదేశానికి ఆపద్భాంధవుడుగా  యడం బాలాజీ.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం అధినేత ఊహించని విధంగా ఆ పార్టి ముఖ్య నేతలు పక్క చూపులు చూడటంతో చంద్రబాబు నాయుడులో తీవ్ర కలవరం మొదలైంది. ఊహించని విధంగా మారిన తెలుగుదేశం రాజకీయ పరిణామాలతో తల పట్టుకున్న చంద్రబాబు పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినా వారి నుండి సానుకూల స్పందన రాకపొవడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇప్పటి వరకు నియొజకవర్గంలో తెలుగుదేశానికి అండగా బలంగా నిలబడిన నేతలు పార్టీని వీడిపొతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో మరో నాయకుడి కోసం వెతుకులాట ప్రారంబించారు.

చీరాల శాసన సభ్యులు కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్ కాంగ్రెస్ లో చేరుతుండడంతో గత ఎన్నికల ముందు వరకు వై.కా.పా లో ఉండి సీటు దక్కకపోవడంతో తెలుగుదేశంలోకి చేరిన యడం బాలాజీ ని చీరాల నియోజకవర్గ ఇంచార్జి నియమిస్తూ ఆదేశాలు జారీ చేరారు.

2019 ఎన్నిక ముందు వరకు వైకాపా పార్టీ చీరాల నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించిన యడం బాలాజీని కాదని చీరాల టికెట్ ఆమంచి కృష్ణ మోహన్ కి ఇవ్వడంతో తెలుగుదేశం పార్టిలోకి చేరిపొయారు, తరువాత జరిగిన ఎన్నికల్లో ఆమంచి కృష్ణ మోహన్ పై చీరాల్లో తెలుగుదేశం నుండి పొటి చేసిన కరణం బలరాం గెలవగా… ఆమంచి కృష్ణమోహన్ కి సీఎం జగన్ నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ రోజు తెలుగుదేశం నుండి గెలిచిన బలరాం వైఎస్సార్ సీపీ లోకి చేరుతుండడంతో యడం బాలాజీ తెలుగుదేశం కు ఆపద్భాదవుడుగా మారారు. వేగంగా మారిన చీరాల రాజకీయ పరిణామాలతో స్వల్ప వ్యవధిలొనే యడం బాలాజి రెండు ప్రధాన పార్టీల తరఫున ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహించడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి