iDreamPost

బాబు రక్తం మరిగి నేటికీ సంవత్సరం..

బాబు రక్తం మరిగి నేటికీ సంవత్సరం..

ఈరోజు ఫిభ్రవరి 1, సరిగ్గా సంవత్సరం వెనక్కి వెళితే గత సంవత్సరం జనవరి 31 న సరిగ్గా అసెంబ్లీ ఎలక్షన్లకి రెండు నెలల ముందు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర న్యాయం చేస్తుందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి నరేంద్ర మోడీ మీద కేంద్రం లోని బిజెపి నాయకుల మీద గంటన్నర సేపు నిద్రలేచిన ఉగ్రసింహంలో విరుచుకుపడిన సంఘటని, ఆనాటి బాబు గారి ఆవేశాన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే..

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా కలసి పని చేసినప్పటికీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంతో పాటు రాష్రాన్ని అభివృద్ధి నిధులు తీసుకురావడంలో తీవ్రంగా విఫలమైందని విపక్షాలు ఆరోపించడం తో పాటు రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో, ప్రజల మూడ్ అర్ధమైన చంద్రబాబు నాయుడు రాజకీయంగా లాభ నష్టాలు బేరీజు వేసుకొని బిజెపితో కొనసాగితే దారుణంగా నష్టపోకతప్పదని గ్రహించి తనకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపితో తెగతెంపులు చేసుకొని, కేంద్రం నుండి బయటకు వచ్చాక రాష్ట్రం కోసమే ఇదంతా చేస్తున్నానని ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే మీడియాలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని “ధర్మ పోరాట దీక్షల” పేరుతొ భారీ ఈవెంట్ మేనేజ్మెంట్ దీక్షలకు తెరతీసి బిజెపితో ప్రత్యక్ష పోరుకి దిగాడు.

గత సంవత్సరం ఇదే రోజుల్లో తన చివరి అసెంబ్లీ సమావేశాలలో నల్లగుడ్డలతో కేంద్రం పై నిరసన తెలుపుతూ అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు తన ప్రసంగంలో నరేంద్రమోడీ పై ఓక్ రేంజ్ లో నిప్పులు కురిపిస్తూ కేంద్ర పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. సభలో బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఎదో చెప్పబోతే.. ఆయన మీద ఓ రేంజ్ లో ఫైర్ అయినా చంద్రబాబు ఉగ్ర రూపంతో తన కళ్ళు పెద్దవి చేసి.. ఏం తమాషాలాడుతున్నారా ?? వినేవాళ్ళుంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతారా ?? మీరు చేసింది చూస్తుంటే నా రక్తం మరిగి పోతుంది. ఏం ఊడిగం చెయ్యలా మీకు ?? తమాషాలాడతారా ??.. అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా మమ్మల్ని జైల్లో పెడతారా మీరు ?? ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ ఇవ్వరా ?? రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఏమైందంటూ బిజెపి సభ్యులపై తీవ్ర పదజాలంతో.. విపరీతమైన హావభావాలతో విరుచుకుపడ్డారు.

ఇంకా ఒకరేంజ్ లో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలకోసం తానూ పొట్టి శ్రీరాములు లాగ ఆత్మత్యాగానికైనా సిద్ధమేనని.. ఎట్టి పరిస్థితుల్లో తానూ రాజీ పడనని, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం ఢిల్లీలో ఎన్నో అవమానాలను దిగమింగానని చెప్పుకొచ్చారు. హైద్రాబాద్ ని తానె కట్టానని.. దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులని తానొక్కడి నిర్ణయంతోనే చేశానని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు బిల్ గేట్స్, అమెరికా అధ్యక్షుడు క్లింటన్ దేశానికి వచ్చినప్పుడు మిస్టర్ క్లింటన్.. అని పలకరించానని, అలాంటిది రాష్ట్రం కోసం రాజకీయాల్లో తనకంటే చాలా జునియర్ అయిన మోడీ ని సార్.. సార్.. అని పిలిచానని, తానూ అంత తగ్గినా, అప్పటికి కూడా మోడీ ఇగో చల్లారలేదని, కానీ మోడీ మాత్రం రాష్ట్రానికి మట్టి నీరు తప్ప ఏమి ఇవ్వలేదని ఆరోపించాడు. గోధ్రా అల్లర్లకు కారణమైన నరేంద్ర మోడీని దించమని తానె స్వయంగా అప్పటి ప్రధాని వాజపేయికి సూచించడం వల్లే మోడీ తనపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుండి చివరి నిమిషంలో బయటకి రావడం, కాంగ్రెస్ తో కలసి పని చెయ్యడానికి ఉత్సాహపడడం, రాహుల్ గాంధీ తో కలసి చెయ్యి చెయ్యి పైన వేసుకొని, భుజం భుజం రాసుకుని ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడంతో పాటు రాహుల్ గాంధీ గెలవబోతున్నారని ఎన్నికల తర్వాత ఒక నివేదికను సైతం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకి ఇచ్చిరావడం జరిగింది. అది సరే ఎన్నికలు అయిపోయాయి. ప్రజలు నమ్మలేదు. చంద్రబాబు తో సహా కాంగ్రెస్ కూడా ఘోరంగా ఓడిపోయింది. మల్లి నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.

కాకపోతే ఎన్నికల ఫలితాలు చుసిన తర్వాత అర్ధమైందేంటంటే, రాష్ట్రం కోసం, తెలుగుజాతి కోసం తన రక్తం మరిగిందని ఎంత బిల్డప్ ఇచ్చినా.. ఎన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ ధర్నాలు చేసినా.. ప్రజలు చంద్రబాబుని ఘోరంగా ఓడించడం చూస్తుంటే , అధికారాన్ని, వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని ఎన్ని కృత్రిమ దీక్షలు చేసినా.. ఎన్ని కృత్రిమ పోరాటాలు చేసినా.. మీడియాని చేతిలో పెట్టుకొని, మీడియా సపోర్ట్ తో ప్రజలను నమ్మించవచ్చని భావించి ఎన్నికల్లో బంగపాటు కి గురైన చంద్రబాబుని చూస్తుంటే.. నాయకులకి కృత్రిమంగా రక్తాలు మరిగినంత మాత్రన ప్రజలు నమ్మరని నిరూపితమైంది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి