iDreamPost

మందు ‘చంద్రుడు’

మందు ‘చంద్రుడు’

అధికారంలో ఉండగా అన్నీ తానేనని, అధికారం కోల్పోగానే ప్రజల కోసమే తాను ఉన్నాననే ఒక విచిత్రమైన వ్యాధితో ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రుడు బాధపడుతుంటారు. (లాక్ డౌన్ పుణ్యమాని ప్రస్తుతం తెలంగాణ లో ఉన్నాడు లెండి). ఇది ఇంతకు ముందు ప్రజలకు అర్థం అయింది. మళ్ళీ మళ్ళీ అర్థమవుతూనే ఉంది. కానీ ఆయనకు మాత్రం అర్థం కావడం లేదు. అది ఏంటంటే తను ప్రజలు క్వారంటైన్ కి పంపించారు అన్నది.

మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ ను, అది పెట్టిన పెద్దాయనను వెన్నుపోటు పొడిచి..ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు టార్గెట్లు పెట్టి మరి మందు షాపులు మెయింటైన్ చేసిన ఘనత వారి సొంతం. విదేశీ పర్యాటకులు ఇక్కడికి రావాలి అంటే 24 గంటలు మందు షాపులు తెరిచి ఉంచాలని సెలవిచ్చి, అమలు చేసిన గొప్పోరు వారు. ఆఖరికి అధికార పీఠం మీద నుంచి వెళ్ళిపోయే ముందు కూడా తమకు అనుకూలంగా ఉన్నారు అన్న ఒకే ఒక్క కారణంతో రెండు ఏళ్ళు అదనంగా మద్యం దుకాణాలకు అవకాశం కల్పించి పోయారు. వాళ్లేమో సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో అమ్మకాల సాగిస్తూ తమకు సాయం చేసిన వారికి కమిషన్ కూడా ముట్ట చెప్పారని అప్పట్లో బహిరంగంగానే గుసగుసలు కూడా వినిపించాయి.

ఇది గత మే నెల ముందేనండోయ్. ఆ తర్వాత ప్రజలు ఇచ్చిన షాక్ కి ఎక్కడ ఉండాలో అర్థంకాక తలో వైపునకు తలదాచుకునేందుకు పోయారు పెద్దలు, ఆయన అననుయులు. ఇప్పుడు మాత్రం ఆన్లైన్ సూక్తులు వల్లే వేస్తున్నారు. నన్ను సలహాలు అడగడం లేదంటూ మారం చేయడం ఒకటి.

ఆ ధైర్యాన్ని కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు..

ఉన్నఫలంగా ఇంటికి పెద్దదిక్కు కోల్పోయారు. దేశాన్ని ఏలుతున్న పెద్ద మనుషులంతా ఒక్కటై కక్షగట్టారు. తొమ్మిదేళ్లపాటు పడరాని పాట్లు పడ్డారు. అప్పుడు అదే ధైర్యం.. ఇప్పుడు అదే ధైర్యం. ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం. ప్రజలకు మేలు చేస్తుందన్నది వెంటనే అమలు చేయడం. ఒకవేళ ఇబ్బంది వస్తే వెంటనే సరిదిద్దుకుని ముందుకు నడవడం. ఆ ధైర్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ కు జనాలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

వ్యతిరేక మీడియా వెంటపడితున్నా.. జగన్ చెప్పిందే చివరికి నిజం అవుతోంది. అదే దేశమంతా అనుసరిస్తోంది. ప్రాంతాలను బట్టి నిర్ణయం వెనక, ముందు ఉండవచ్చు గాక. కానీ ఇప్పుడు యువ సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అనేక కార్యక్రమాల వైపు ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా చూస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ముందు చెప్పిన పై పేరాలో అనే పెద్దమనిషి అంటారా.. ఆయన అంతే..ఏ విపత్తు వచ్చినా ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు. పాపం అది ఆయనకు పుట్టుకతో వచ్చిన లక్షణం. ప్రకృతి విపత్తు, ప్రజలు ఇబ్బంది.. ఏదైనా గాని ఆయనకు కోసమే వచ్చిందనుకోవడం ఆయనకే చెల్లింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి