iDreamPost

రైతులకు శుభవార్త.. భారీగా పెరగనున్న PM కిసాన్‌ సాయం!

  • Published Aug 22, 2023 | 1:26 PMUpdated Aug 22, 2023 | 1:26 PM
  • Published Aug 22, 2023 | 1:26 PMUpdated Aug 22, 2023 | 1:26 PM
రైతులకు శుభవార్త.. భారీగా పెరగనున్న PM కిసాన్‌ సాయం!

అన్నదాతల ఆదాయం పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందజేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్‌ యోజన కింద అన్నదాతలకు ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ క్రమంలో పీఎం కిసాన్‌ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. పీఎం కిసాన్‌ యోజన కింద అందించే సాయాన్ని భారీగా పెంచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుందట. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన కింద.. ఒక్కొ రైతుకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున నగదు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్‌ యోజన కింద అందించే సాయాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద రైతలకు మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున ఏడాదికి రూ. 6 వేల సాయాన్ని నేరుగా లబ్ధిదారలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మొత్తాన్ని మరో 50 శాతం వరకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 50 శాతం పెంచితే.. ఇకపై ప్రతి ఏటా రైతులకు రూ. 9 వేల వరకు నగదు అందనుంది. కిసాన్‌ యోజన సాయం పెంపుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రధాన మంత్రి కార్యాలయం ముందు ఉన్నాయని ఓ అధికారి చెప్పినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం ప్రచురింది. అయితే దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అయితే, 50 శాతం మేర పెట్టుబడి సాయం పెంచితే కేంద్రంపై ఏడాదికి మరో రూ. 30 వేల కోట్ల వరకు అదనపు భారం పడనుంది అని అంచనా వేస్తున్నారు. మరి కొన్ని నెలల్లో దేశంలోని రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే.. అన్నదాతలకు అందే సాయం పెరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి