iDreamPost

కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి!

కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి!

ఈ మధ్యకాలంలో తరచూ  ప్రజాప్రతినిధులు, మంత్రులపై దాడులు జరుగుతున్నాయి. అలానే కొందరు ప్రజాప్రతినిధులు కూడా దారుణ హత్యలకు గురయ్యారు. కొన్ని నెలల క్రితం జపాన్ మాజీ ప్రధానిని నడి రోడ్డుపై కాల్చి చంపారు. అలానే పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో బయట పడ్డారు. తాజాగా మన దేశ  కేంద్ర మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి జరిగింది. ఈ ఘటన మణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ లో గత కొంతకాలం నుంచి  హింసాకాండ జరుగుతోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా అలర్లు.. ఇంకా కొనసాగుతోన్నట్లే కనిపిస్తున్నాయి. నెల రోజులు దాటినా ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. రెండు వర్గాల మధ్య రాజుకున్న చిచ్చు.. ఇంకా ఆరలేదు. తాజాగా 1000 మందికిపైగా నిరసనకారులు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో హింసాకాండకి దిగారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో ఎగబడిన జనం మంత్రి ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరారు. ఈ విషయాన్ని మంత్రి నివాస భద్రతా సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ  నిరసన కారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేయడం గమన్హారం. పెట్రోల్ బాంబు దాడి చేసిన మంత్రి నివాసంలో 24 మంది విధుల్లో ఉన్నారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  మంత్రి ఇంటిని చుట్టు ముట్టిన ఆందోళన కారులు.. అన్ని వైపుల నుంచి పెట్రోల్  బాంబులను విసిరారు. దీంతో అక్కడ ఉన్న భద్రత సిబ్బంది.. పరిస్థితిని నియంత్రించ లేకపోయారు.

 ముందు, వెనక అన్ని వైపుల నుంచి నుంచి బాంబులు విసరడంతో పరిస్థితిని నియంత్రించలేకపోయామని  పేర్కొన్నారు.  మంత్రి రంజన్‌ సింగ్‌ ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో  కూడా ఇంటిపై దాడికి యత్నం జరగ్గా.. భద్రతా సిబ్బంది నిరసనకారులను చెదరగొట్టారు. ఇక రంజన్‌ సింగ్‌ ప్రస్తుతం మోదీ మంత్రి వర్గంలో విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు అందరూ కలిసి రావాలని మంత్రి కోరారు. హింసను ప్రేరేపిస్తోన్న స్థానిక నేతలను గుర్తించి, చర్యలు తీసుకోవాలని మోదీకి లేఖ రాశారు. మరీ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి