iDreamPost

కరోనా ఎఫెక్ట్‌ : ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత

కరోనా ఎఫెక్ట్‌ : ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత

కరోనా వైరస్‌ వల్ల దేశంలో కార్యకలాపాలు స్తంభించి ఆదాయం తగ్గడంతో ఆర్థిక క్రమశిక్షణకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ముగిసిన కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో పలు నిర్ణయాలు తీసుకుంది. ఆయా నిర్ణయాలను కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితోపాటు ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించాలని తీర్మానించింది. తద్వారా మిగిలే నిధులను కన్సాలిడేటెడ్‌ ఖాతాకు జమచేయాలని నిర్ణయించింది. ఎంపీ ల్యాండ్స్‌ను రెండేళ్లపాటు సస్పెన్షన్‌లో ఉంచింది. ఆ సొమ్మును కరోనా నియంత్రణ చర్యలకు ఉపయోగించాలని తీర్మానించింది. ప్రతి ఎంపీకి ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు తమ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తాజా నిర్ణయంతో ఆయా నిధులు రెండేళ్లపాటు వారికి నిలిచిపోతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి