iDreamPost

దావూద్, ఛార్లెస్ శోభరాజ్ కన్నా పెద్ద గజ దొంగ రేవంత్ రెడ్డి : KTR

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశాయి ఆయా పార్టీలు. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు.

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశాయి ఆయా పార్టీలు. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు.

దావూద్, ఛార్లెస్ శోభరాజ్ కన్నా పెద్ద గజ దొంగ రేవంత్ రెడ్డి : KTR

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానేలేదూ.. పార్టీలు ఉధృతంగా ప్రచారాలను చేపడుతున్నాయి. తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది అధికార బీఆర్ఎస్. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. మ్యానిఫెస్టోనూ విడుదల చేసింది. అటు కాంగ్రెస్ సైతం తొలి జాబితాను విడదుల చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తెలంగాణలో మూడు రోజుల పాటు బస్సు యాత్ర చేపడుతున్నారు. తనదైన స్టైల్లో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లున్నారు. ఇక బీజెపీ ఎటువంటి అభ్యర్థులను ప్రకటించలేదు. మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయలేదు.

ఇదే సమయంలో అసమ్మతి, అలక నేతలు.. ఇతర పార్టీల్లోకి వలసలు మొదలు పెడుతున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. ఎన్నికలు దగ్గరపడ్డ కొద్దీ అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. వాడి వేడిగా వాగ్బాణాలు దూసుకు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసినా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పెద్ద గజ దొంగ అని, ఆయన ముందు దావూద్ ఇబ్రహీం, ఛార్లెస్ శోభరాజ్ కూడా చిన్నోళ్లు అని అన్నారు.

గతంలో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు రేటు చేస్తున్నాడని, రేపు రాష్ట్రమంతా, కాంగ్రెస్ ను బీజెపీకి అమ్మేస్తాడు. అలాంటి 420ని పక్కన కూర్చొబెట్టుకుని రాహుల్ గాంధీ.. కేసీఆర్ దొంగ అంటూ విమర్శలు చేస్తున్నాడని అన్నారు. మరోసారి తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేశారు కేటీఆర్. రాహుల్ గాంధీ హోం వర్క్ చేయని నాయకుడని, స్థానిక నాయకుల ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివుతున్నారని అన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ అవినీతి పెరిగిపోయిందని అంటున్నారని, కానీ మీ పక్కనే పెద్ద దొంగ ఉన్నాడంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయన దావూద్ ఇబ్రహీం, ఛార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి