iDreamPost

CBSE 10, 12వ తరగతి ఫలితాలొస్తున్నాయి.. ఇలా చెక్ చేసుకోండి

పరీక్షల కాలం ముగిసింది అనుకుంటే.. ఫలితాల సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలను విడుదల చేయాయి ఆయా బోర్డులు. ఇప్పుడు సీబీఎస్ఈ ఫలితాలు కూడా రాబోతున్నాయి.

పరీక్షల కాలం ముగిసింది అనుకుంటే.. ఫలితాల సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలను విడుదల చేయాయి ఆయా బోర్డులు. ఇప్పుడు సీబీఎస్ఈ ఫలితాలు కూడా రాబోతున్నాయి.

CBSE 10, 12వ తరగతి ఫలితాలొస్తున్నాయి..  ఇలా చెక్ చేసుకోండి

పరీక్షలు ముగిశాయి.. ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. పదో తరగతి, 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఆయా రాష్ట్రాల బోర్డులు ప్రకటిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే పది, ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఇక తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ ఫలితాలొచ్చాయి. అటు యూపీలో కూడా టెన్త్, ప్లస్ టూ రిజల్ట్స్ రిలీజ్ చేసింది బోర్డు. కాగా, స్టేట్ సిలబస్ చదివిన వాళ్లే కాకుండా సెంట్రల్ బోర్డు విద్యార్థులు కూడా ఇటీవల పరీక్షలు రాశారు. మిగిలిన రాష్ట్ర బోర్డులతో పోల్చుకుంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫలితాలు కాస్త ఆలస్యంగానే వస్తాయి. కాగా, ఈ ఏడాది సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు త్వరగానే రాబోతున్నాయి.

ఈ ఏడాదిలో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు జరిగాయి. అలాగే 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. అన్ని పరీక్షలను ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. ఈ ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయని సమాచారం. మే తొలి వారంలో సీబీఎస్ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. కానీ బోర్డు నుండి ఎటువంటి అధికారిక ప్రటకన రాలేదు. గత ఏడాది మే 12న రిజల్ట్స్ రిలీజ్ చేసింది. కాగా, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో కాస్త త్వరగానే రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే.. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cbse.gov.in/లో తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే

  • cbseresults.nic.in
  • results.cbse.nic.in
  • cbse.nic.in

ఈ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచుతారు.  డిజిలాకర్ వెబ్‌సైట్‌, డిజిలాకర్ మొబైల్ యాప్, ఉమంగ్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి