iDreamPost

తెలుగుదేశం మెడకు బిగుసుకుంటున్న ఇన్సైడర్ ట్రేడింగ్ ఉచ్చు

తెలుగుదేశం మెడకు బిగుసుకుంటున్న ఇన్సైడర్ ట్రేడింగ్ ఉచ్చు

రాజధాని కుంభకోణం తెలుగుదేశంకు యమపాశంలా మారబోతోంది. ఇన్ని రోజులు ఒక అబద్దాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్దాలు ఆడినా , ఒక తప్పుని కప్పిపుచ్చడానికి వంద తప్పులు చేసినా ఓటుకు నోటు లాంటి తీవ్రమైన నేరాలను సైతం మ్యానేజ్ చేయగలిగినా చంద్రబాబు నాయుడుకు అధికారం అనే అస్త్రం చేతిలో ఉండటంతో చెల్లిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అధికారం అందని ద్రాక్ష అయింది. చేసిన నేరాల లెక్క మాత్రమే చేతిలో మిగిలిపొయింది. నాకే పాపం తెలియదని నమ్మించడానికి చంద్రబాబు తీసుకునే ప్రతిచర్యకు, చేసే ప్రతి ప్రకటనని ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు . ఎందుకంటే 5 ఏళ్ళ బాబు పాలనకు ప్రజలే సాక్ష్యం.

ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ కి సరికొత్త రాజధాని నిర్మిస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు , గుట్టు చప్పుడు కాకుండా అంతులేని భూ దోపిడికి పాల్పడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజధాని ప్రకటించే వరకు (2014 జూన్ – డిసెంబర్ ) మధ్యకాలంలో రాజధాని అక్కడ ఏర్పాటు చెస్తాం , ఇక్కడ ఏర్పాటు చేస్తాం అని చెబుతూ ప్రజలను తప్పు దోవ పట్టించి “ఓత్ ఆఫ్ సిక్రెసీ”ని ఉల్లంఘించి ముందుగానే నిర్ణయించ్చుకున్న రాజధాని ప్రాంతంలో అనునాయుల చేత వేల ఎకరాలు కొనుగోలు చేసి దేశంలోనే అతి పెద్ద స్కాంకి తెరలేపారు. సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ గీస్తుంది అని చెప్పడంతో మొదలైన అబద్దాలు చివరికి తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారిని బినామీలుగా మార్చుకుని కోట్లు విలువ చేసే భూములని కొట్టేసే దాక యథేచ్ఛగా భూ కుంభకోణాలకు పాల్పడ్డారు.

దీంతో మొదటి నుండి చెబుతునట్టుగానే వై.యస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం రాజధానిలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి సిద్దమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినేట్ సబ్ కమిటిని నియమించడంతో మొదలైన అడుగు, డిసెంబర్లో పలు రిజిస్ట్రెషన్ డాక్యుమెంట్లుతో క్యాబినేట్ సబ్ కమిటి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మరింత లోతుగా ఆధారాలు సేకరించాలనే లక్ష్యంతో ఈ కేసు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సి.ఐ.డికి అప్పగించింది. దీంతొ సీఅర్డిఏ పరిదధిలో జరిగిన కుంభకోణం నిగ్గుతేల్చడానికి సి.ఐ.డి విచారణ మొదలుపెట్టి తెలుగుదేశం హయాములో జరిగిన అంతులేను భూ దోపిడి పుట్టను కదిలించింది. మొత్తం 797 మంది తెల్ల రెషన్ కార్డుదారులు కోట్లు విలువ చేసే 759 ఎకరాల భూములు కొన్నట్టు గుర్తించింది వీటి రిజిస్ట్రెషన్ విలువ 38.5 కోట్లు ఉంటుందని తేల్చింది. వీటితో పాటు తెలుగుదేశానికి సంబంధించిన నేతలు వారి భందువులు , బినామీలు కలిసి మొత్తం 4,069.94వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ పద్దతిలో భూ దోపిడికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలు సేకరించింది. అంతే కాకుండా ఈ వ్యవహారంలో తెలుగుదేశం నేతలు మని ల్యాడరింగ్ కు పాల్పడ్డాని సి.ఐ.డి అధికారులు ఆదారాలతో సహా ఎంఫొర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాయడంతో ఈ.డి సైతం కేసు నమోదు చేసింది.

అయితే ఈ భూకుంభకోణం పై సి.ఐ.డి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సి.బి.ఐ సంస్థ చేత విచారణ జరిపి నిజాలు తేల్చి దోషులని శిక్షించాలనే ఆలోచనతో కేసును సి.బి.ఐ కు అప్పచెబుతు నోటిఫికేషన్ విడుదల చెసింది ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉతర్వ్యులు జారీ చేశారు. దీంతో అంతులేని భూదోపిడి చేసిన తెలుగుదేశం నేతల మెడలకు ఈ ఉచ్చు మరింత బిగుసుకోనుంది. పట్టపగలు యథేచ్ఛగా జరిగిన ఈ భూదోపిడి పుట్ట పగలబోతోంది. ఇప్పటికే తెలుగుదేశం నేతలైన పత్తి పాటి పుల్లారావు, నారాయణపై కేసులు నమోదు కాగా , ఇప్పుడు సి.బి.ఐ రంగ ప్రవేశం చేయడంతో సుమారు అరడజనకు పైగా తెలుగుదేశం నేతలు వారి బినామీలు ఈ ఉచ్చు లో ఇరుక్కోనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి