iDreamPost

మత్తు డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు నమోదు-డామిట్ కథ అడ్డం తిరిగింది..

మత్తు డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు నమోదు-డామిట్ కథ అడ్డం తిరిగింది..

లాక్ డౌన్ సమయంలో తనకు మాస్క్ ఇవ్వలేదని మీడియా ముందు రభస చేసిన సుధాకర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుని కలిసి వచ్చిన తర్వాత ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర కోణంలో ఆరోపణలు చేశాడని సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా నిర్ధారించిన ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసిన దరిమిలా ఇది అక్రమం అంటూ టీడీపీ పార్టీ ప్రభుత్వం పై ఆరోపణలు చేసిన విషయం విదితమే .

ఆ తరువాత గత నెలలో డాక్టర్ సుధాకర్ కారులో తన ఇంటికి వెళుతూ మధ్యలో కారు ఆపి ఆటో డ్రైవర్స్ ని , స్థానికులను నానా విధాలుగా తిడుతూ ఉండగా స్థానికులు 100 కి కంప్లైంట్ ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులను దుర్భాషలాడటంతో పాటు , ఏపీ , తెలంగాణా ప్రభుత్వాధినేతలను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు కుల మత విద్వేష వ్యాఖ్యలు చేయడం , సదరు ఘటనను చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్ ఫోన్ పగలగొట్టడంతో పాటు , తనకు కరోనా ఉందని పిచ్చిగా అరుస్తూ చొక్కా తీసివేసి అదుపుతప్పి ప్రవర్తిస్తుండటంతో స్థానిక ఆటో డ్రైవర్ సహాయంతో సదరు డాక్టర్ చేతులు బంధించి అదుపులోకి తీసుకొని కేజీహెచ్ కి పంపగా మానసిక స్థితి సరిలేని కారణంగా మానసిక వైద్యశాలకు రిఫర్ చేయగా అక్కడికి తరలించారు .

హాస్పిటల్ లో సుధాకర్ ని కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత ఎడిటెడ్ వీడియోతో కోర్టుకు లేఖ రాయగా సుమోటోగా తీసుకొన్న కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది . ఆ మేరకు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు సుధాకర్ నుండి పోలీసులు , ఘటనా స్థలిలో సాక్ష్యులు , కేజీహెచ్ వైద్యులు , సుధాకర్ కుటుంబ సభ్యులు అందరినీ విచారించడంతో పాటు సుధాకర్ గత ప్రవర్తనను గురించి కూడా విచారించి తుదకు మంగళవారం సుధాకర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు .

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం , ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వాన్ని , పలువురు నేతల్ని కుల మత విద్వేష వ్యాఖ్యలతో దూషించడం , పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం , పోలీసులకు సహకరించకుండా కరోనా ఉందంటూ అల్లరి చేయడం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం పై సెక్షన్ 188 , 357 ల కింద కేసు బుక్ చేసి సీబీఐ వెబ్ సైట్ లో పొందు పరిచినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య నిన్న రాత్రి తెలిపారు .

కాగా గతంలో ఒకసారి నర్సీపట్నం ఆస్పత్రిలో ఏడుగురు గర్భిణులకు సర్జరీ చేయాల్సిన టైంలో చివరి నిమిషంలో విధులకు డుమ్మా కొట్టి ఆ గర్భిణులను ప్రమాదకర స్థితిలోకి నెట్టి హాస్పిటల్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన సుధాకర్ వైఖరి ఆది నుండీ వివాదాస్పదమే కాగా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుకి సన్నిహితుడు అని సమాచారం.

సుధాకర్ కేసు విషయంలో అన్యాయం జరిగిందని గగ్గోలుపెట్టి కేసు సీబీఐకి అప్పగించాలని గోల చేసిన టీడీపీ నేతలు సీబీఐ కూడా సుధాకర్ నేరాలు నిర్ధారించి కేసు నమోదు చేయడం పట్ల ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి