iDreamPost

సాయి పల్లవిపై కేసులు.. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు..

సాయి పల్లవిపై కేసులు.. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు..

రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17న రిలీజ్ అవుతుండటంతో గత రెండు వారాలుగా చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయండి అంటూ కూడా సోషల్ మీడియాలో సాయి పల్లవిని ట్రోల్ చేశారు. ఇక సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదమవడంతో పలు రాష్ట్రాల్లో సాయి పల్లవిపై కేసులు నమోదు అయ్యాయి.

తాజాగా సాయి పల్లవి గురించి, ఆమె వ్యాఖ్యల గురించి ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. మూవీ పాపులర్ కావాలని, తాము పాపులర్ కావాలని కొంతమంది నటులు, డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారు. సాయి పల్లవి కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కామెంట్ చేశారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైంది. కాశ్మీర్ కి వెళ్లి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్ పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు అని అన్నారు.

అలాగే.. మేము ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు చేస్తాం, ఇది సాయి పల్లవికి తెలీదు అనుకుంట. ఇప్పటికే సుల్తాన్ బజార్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. FIR నమోదు చేయాలి. తెలంగాణ, ఏపీ అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదులు చేయాలి. ఒక్క యాక్టర్ ని అరెస్ట్ చేస్తే ఎవరూ హిందువుల జోలికి రారు. నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ కి ఇస్లాంపై కామెంట్ చేసే ధైర్యం ఉందా అని సీరియస్ అయి ప్రశ్నించారు. అలాగే సాయి పల్లవిపై పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి