iDreamPost

తస్మాత్ జాగ్రత్త.. వ్యూస్ కోసం మీరూ ఇలాంటి పనులు చేస్తున్నారా?

తస్మాత్ జాగ్రత్త.. వ్యూస్ కోసం మీరూ ఇలాంటి పనులు చేస్తున్నారా?

సోషల్ మీడియా అనేది ప్రస్తుతం అందరి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. టైమ్ పాస్ కావాలన్నా, సెలబ్రిటీ కావాలన్నా, సంపాదించాలి అన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియా ప్రధాన సోర్స్ అయిపోయింది. చాలా మంది ఈ సోషల్ మీడియా ద్వారానే లక్షల్లో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు ఈ పని మొదలు పెట్టేస్తున్నారు. తమకు తెలిసిన పనిని.. తమలో ఉన్న టాలెంట్ ని కాస్త భిన్నంగా ప్రదర్శిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నారు. అయితే కొందరు యువకులు మాత్రం ఆ సృజనాత్మకత కాస్త ఎక్కువై కటకటాల పాలయ్యారు.

సోషల్ మీడియాలో యూట్యూబ్ అనేది మీరు సెలబ్రిటీగా మారేందుకే కాదు.. దాని ద్వారా లక్షలు కూడా సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు కూడా వ్లాగర్స్ గా మారి తమకంటూ సొంత ఛానల్స్ ఏర్పాటు చేసుకుని యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించేస్తున్నారు. వీడియోస్ చేసి వాటి ద్వారా వ్యూస్ సంపాదించుకుని.. డబ్బు సంపాదించేయచ్చు అని ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో చాలా కొద్ది మందే సక్సెస్ అవుతున్నారు. ఎక్కువ మంది అలాగే ఉండిపోతున్నారు. వీళ్లు మాత్రం వ్యూస్ కోసం ఒక ప్రయత్నం చేసి చివరకు జైలు పాలయ్యారు.

ఆ యువకులు ములుగు జిల్లాకు చెందిన వారు. విలేజ్ థింగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. వారి ఊరిలో జరిగే చిన్న చిన్న విషయాలను వీడియోలుగా చేసి అప్ లోడ్ చేయడం ప్రారంభించారు. ఆ వీడియోస్ కి వారు అనుకున్నంత ఆదరణ, వ్యూస్ రావడం లేదు. దాంతో కొత్తగా ఏదైనా చేయాలి అని ప్లాన్ చేశారు. వాళ్లే అడవిలోకి వెళ్లి వేటాడి దానిని వీడియోగా చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అనుకున్నదే తడవుగా.. అడపలతో వేట- ఇది మా ప్రాచీన పద్ధతి అంటూ వీడియో చేశారు. అందులో వీళ్లు అడవికి వెళ్లి ఉచ్చు ఏర్పాటు చేసి అందులో అడవి కోడి పడినట్లు చూపించారు.

ఆ తర్వాత ఆ కోడిని కాల్చుకుని తిన్నారు. ఆ వీడియో నవంబర్ 8, 2022లో వారి ఛానల్ లో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో కూడా వాళ్లు ఊహించినట్లు ఏమీ రీచ్ అందుకోలేకపోయింది. అది అటు ఇటూ తిరుగుతూ ఫారెస్ట్ అధికారుల కంట పడింది. వాళ్లు పోలీసులతో కలిసి వైల్డ్ లైఫ్ సెక్షన్స్ కింద ఆ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటను ఒక ఉదాహరణ చేసుకుని కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్లు, కంటెంట్ క్రియేటర్స్ గా ఉన్నవాళ్లు ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. వ్యూస్ రావడం ముఖ్యమే కావచ్చు.. కానీ, అందుకోసం మీరు ఏం చేస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. మీరు చేసే వీడియో పర్యావసానాలు ఏంటి అనేది గుర్తుంచుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి