iDreamPost

రాజధాని మార్పు – నిధులపై బిజేపి వైఖరి ఏంటి?

రాజధాని మార్పు – నిధులపై బిజేపి వైఖరి ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాఫ్రికా మాదిరి మూడు రాజధానులు ఏర్పాటు జరగవచ్చు అంటు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నేపధ్యంలో మరో సారి రాజధానిపై చర్చ జోరందుకుంది. అభివృద్ది వికేంద్రీకరణపై మొగ్గుచూపుతున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక శాతం మంది సమర్ధిస్తుంటే అతి కొద్దిశాతం మంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో ఎక్కువగా రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి కి భూములు ఇచ్చిన రైతులే ఉండగా, పార్టీల పరంగా చూస్తే రాజధాని వికేంద్రీకరణని తెలుగుదేశం, జనసేన , కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తే భారతీయ జనతా పార్టీ, లోక్ సత్తా పార్టీ స్వాగతించాయి.

అయితే ఇక్కడ అన్ని పార్టీల మాదిరి భారతీయ జనత పార్టీ కూడా తాము స్వాగతిస్తున్నాం అని చెప్పి ఊరుకుంటే సరిపొదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం సహరించాలని స్పష్టంగా చెప్పిన నేపధ్యంలో 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కేంద్రం రాజధాని మౌళిక సదుపాయాల నిమిత్తం 2500 కోట్లు ఇచ్చినట్టు రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. అయితే తాత్కాలక భవనాలతో 5 ఏళ్ళు కాలక్షేపం చేసిన తెలుగుదేశం ఆ నిధులు ఎక్కడ వినియోగించిందో తెలియని పరిస్థితి. దీనిపై భారతీయ జనతా పార్టీ తీసుకునే చర్య ఉంటుందా, మేము నిధులు ఇచ్చేసాం అని చేతులు దులుపుకుంటారా? నేషనల్ హైవే అధారిటి ఆఫ్ ఇండియా, రాజధాని ఆవుటర్ రింగ్ రోడ్ కి 19,700 కోట్లు ఇస్తాం అని ఒప్పుకుంది. ఇప్పుడు ఆ నిధులు రాష్ట్ర కోరిక మేరకు విడుదల చేస్తారా లేక అదే అమరావతికి కేటాయిస్తారా లాంటి అనేక సమస్యలపై కేంద్రం స్పష్టం చేయవలసిన అవసర ఉంది. దీనిపై భారతీయ జనతా పార్టీ ఎంత త్వరగా స్పందిస్తే ప్రజల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితి అని త్వరగా తగ్గుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి