iDreamPost

తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం- పదవ తరగతి పరీక్షలు రద్దు..

తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం- పదవ తరగతి పరీక్షలు రద్దు..

తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నిర్వహించాల్సిన పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వివరాలలోకి వెళితే కరోనా కారణంగా తెలంగాణా లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే పదవ తరగతి పరీక్షల నిర్వహణపై హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణా హైకోర్టు ఆదేశించడంతో మిగిలిన జిల్లాలకు ఒకసారి, హైదరాబాద్ లో ఒకసారి పరీక్షల నిర్వహణ సాధ్యపడదని ప్రభుత్వం భావించడంతో పరీక్షలు వాయిదా వేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణా ప్రభుత్వ నిర్ణయంతో 5,34,903 మంది విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. కాగా ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా పదవ తరగతిలో గ్రేడింగ్ లు నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ విషయంలో కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి