iDreamPost

భారతీయుడి పేరుపై కెనడా కంపెనీ సెటైర్లు.. లక్షల్లో పరిహారం కట్టిన వైనం!

  • Published Apr 11, 2024 | 5:38 PMUpdated Apr 11, 2024 | 5:38 PM

ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ భారతీయుడు పేరు హేళన చేసిన కారణంగా.. 10,000 డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ భారతీయుడు పేరు హేళన చేసిన కారణంగా.. 10,000 డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 11, 2024 | 5:38 PMUpdated Apr 11, 2024 | 5:38 PM
భారతీయుడి పేరుపై కెనడా కంపెనీ సెటైర్లు.. లక్షల్లో పరిహారం కట్టిన వైనం!

ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు వారికీ రకరకాల పేర్లు ఉంటాయి. ఇతర దేశాల వారి పేర్లు మనకు ఎలా కాస్త కొత్తగా ఉంటాయో.. భారతీయుల పేర్లు కూడా వారికీ అలానే ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇండియన్ పేరు కారణంగా తీవ్ర చర్చలు జరిగాయి. ప్రపంచంలో ఎక్కడైనా కానీ.. ఒక వ్యక్తికీ తన పేరే గుర్తింపును ఇస్తుంది. అలాగే మనం ఆన్లైన్ లో కానీ బయట కానీ ఏ వస్తువునైనా కొన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ.. మన పేరు, డీటెయిల్స్ ఇస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే ఒక భారతీయుడి పేరు పట్ల అవమానం జరిగింది. దీనితో ఆ సంస్థ ఇతనికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల భువన్ చిత్రంశ్ అనే వ్యక్తి.. డీబ్రాండ్ అనే ఒక ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మే కంపెనీ నుంచి.. మ్యాక్ బుక్ ను కొనుగోలు చేశాడు. అయితే రెండు నెలలు గడిచేలోపే రంగు వెలిసిపోయింది, దీనితో అతను సోషల్ మీడియా వేదికగా ఆ కంపెనీని ట్యాగ్ చేస్తూ.. ఆ వస్తువుపై కంప్లైంట్ చేసాడు. ఈ క్రమంలో ఆ కంపెనీ ఇతని కంప్లైంట్ కు స్పందిస్తూ.. అతని పేరుపై విపరీత అర్ధాలు వచ్చేలా రాసింది. దీనితో ఇది చూసిన నెటిజన్లు ఆ సంస్థపై విరుచుకుపడ్డారు . ఒక భారతీయుడి పేరుపై వెటకారంగా రాయడం సరైంది కాదు అంటూ మండిపడ్డారు. మీరు హద్దులు మీరుతున్నారంటూ గుర్తు చేశారు. అంతే కాకుండా మీ బ్రాండ్ వస్తువులను ఇంకే భారతీయుడు కూడా కొనకపోవచ్చు అంటూ.. హెచ్చరించారు. మీరు మీ ప్రతిష్టను దిగజార్చుకుంటారా అంటూ నిలదీశారు.

ఇక దీనితో బ్రాండ్ యాజమాన్యం వీటిని దృష్టిలో ఉంచుకుని.. దిగి వచ్చింది. మేము మా కస్టమర్ పేరును ఎగతాళి చేశామని ఒప్పుకుంది. దీనిని పెద్ద తప్పుగా భావిస్తున్నామని.. క్షమాపణలు కోరింది. అలాగే గుడ్ విల్ కింద 10,000 డాలర్లు ఆఫర్ చేసింది. అంతా బాగానే ఉంది అనుకునే క్రమంలో.. అయినా, ఇలా కస్టమర్లతో గత పదేళ్లుగా చేస్తున్నామని.. దీనిని ఆపబోమని.. అయినా 10,000 డాలర్లు అందుకోబోయేది మీరేనంటూ మళ్ళీ వక్రబుద్ధితో రాసుకొచ్చింది. దీనితో నెటిజన్లు మళ్ళీ మండిపడ్డారు. ఏదేమైనా ఒక వ్యక్తి పేరును ఇలా హేళన చేయడం అనేది సరైన పద్దతి కాదు. అది కూడా ఒక ప్రముఖ బ్రాండ్ అయ్యి ఉండి.. సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్నందుకు నెటిజన్లంతా కూడా.. ఆ సంస్థపై మండి పడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి