iDreamPost

Valimai Trailer : కార్తికేయకి అక్కడ బ్రేక్ దొరికితే పండగే

Valimai Trailer : కార్తికేయకి అక్కడ బ్రేక్ దొరికితే పండగే

బాలీవుడ్ లో బైక్ ఛేజింగ్ దొంగతనాలను బేస్ చేసుకుని వచ్చిన సినిమాల్లో ఇప్పటిదాకా ధూమ్ దే ప్రత్యేక స్థానం. మూడు భాగాలు వచ్చినా దేనికవే బ్లాక్ బస్టర్లు. జాన్ అబ్రహం తర్వాత విలన్ పాత్రను చూసి ముచ్చటపడి ఏరికోరి మరీ హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ లు ఈ క్యారెక్టర్ చేశారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ధూమ్ 4 అనుకున్నారు కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం నిన్న సాయంత్రం రిలీజైన అజిత్ వలిమై ట్రైలర్. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఎంటర్ టైనర్ 2022 సంక్రాంతికే రాబోతోంది. అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ నిన్న అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ట్రైలర్ మొత్తం టెర్రిఫిక్ విజువల్స్ తో నింపేశారు. తెలుగు ఆడియన్స్ దృష్టిని ఎక్కువ ఆకట్టుకున్న అంశం విలన్ గా నటించిన మన ఆరెక్స్ 100 కార్తికేయ. తన పాత్రని ధూమ్ స్టైల్ లోనే తీర్చిద్దిద్ధినట్టు క్లారిటీ వచ్చేసింది. డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు కానీ అదేమంత పెద్ద సమస్య కాదు. తెలుగులో బలం టైటిల్ తో రాబోతున్న వలిమై ఇక్కడి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల పోటీని తట్టుకుని ఎలా నిలబడుతుందో వేచి చూడాలి. వీడియోలో చాలా తక్కువ డైలాగు పార్ట్ ఉంది. ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ తోనే మూడు నిముషాలు నింపేశారు. ఓవర్ ది బోర్డ్ హీరోయిజం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలాగే దర్శకుడు వినోత్ ప్రెజెంట్ చేశారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ధూమ్ ప్రభావం, ఇదే వినోత్ తీసిన ఖాకీ సినిమా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అజిత్ ఇలాంటి రోల్ చేయలేదు కాబట్టి తమిళనాడులో రికార్డుల ఊచకోత ఖాయమే. ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకవేళ హిట్ అయితే మాత్రం కార్తికేయ బంపర్ ఆఫర్ కొట్టినట్టే. ఎందుకంటే ఇక్కడ వరస డిజాస్టర్లతో మార్కెట్ తగ్గించుకున్నాడు. ఒకవేళ బలం కనక వర్కౌట్ అయితే కోలీవుడ్ లో సెటిల్ అవ్వొచ్చు. ఎంతవాడు కానీ లో విలన్ గా చేశాకే అరుణ్ విజయ్ స్టార్ డం పెరిగిపోయి ఇప్పుడు సోలో హీరోగా స్వంతంగా మార్కెట్ సంపాదించుకున్నాడు. మరి కార్తికేయకు కూడా అలా కలిసి వస్తుందేమో చూడాలి

Also Read : Ticket Price : ఛాన్స్ ఇస్తే ఇదెక్కడి పైత్యం.. ఇలా అయితే మొదటికే మోసం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి