iDreamPost

చేపల కూర తిని కాళ్లు, చేతులు పొగొట్టుకున్న మహిళ

చేపల కూర తిని కాళ్లు, చేతులు పొగొట్టుకున్న మహిళ

మాంసాహార ప్రియులు తొలుత ప్రాధాన్యతనిచ్చేది చికెన్ ఆ తర్వాత చేపలు, రొయ్యలు, ఇతర జీవాలకు. చికెన్, చేపలతో పోల్చుకుంటే.. చేపలే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు వైద్యులు. చాలా మంది చేపల కూరను ఇష్టపడుతుంటారు. చేపల పులుసు, ఫ్రై, ఇగురు అంటూ రకరకాల పద్ధతిలో చేసుకుంటారు. ఇక మార్కెట్‌లో లభించే రకరకాల చేపలను బట్టి వంటకాలు చేసుకునే తీరు మారిపోతూ ఉంటుంది. ఈ రోజు చాపల కూర వండితే.. మరుసటి రోజు మరింత రుచిని ఇస్తుందని చెబుతుంటారు పెద్దలు. చేపలను సరైన పద్ధతిలో వండుకుని తింటే కంచం ఖాళీ కావాల్సిందే. అయితే చేపల కూర వండుకుని తిని ఓ మహిళ చావు అంచుల వరకు చేరింది. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

కాలిఫోర్నియాకు చెందిన లారా బరాజస్ శాన్ జోస్‌లోని స్థానిక మార్కెట్ నుండి బ్యాక్టీరియా సోకిన తిలాపియా జాతికి చెందిన చాపను జులై చివరిలో కొనుగోలు చేసింది. దాన్ని వండుకుని తిన్నాక అనారోగ్యానికి గురైంది. లారా స్నేహితురాలు అన్నా మెస్సినా తెలిపిన వివరాల ప్రకారం.. లారాకు ఆరేళ్ల బాలుడు ఉండగా.. చేపలు వండిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. ఆమె ఇన్ ఫెక్షన్ బారిన పడి నాలుగు అవయవాలను కోల్పోయింది. సరిగ్గా ఉడికించని చేపలు తిన్న తర్వాత లారా వేళ్లు, కాళ్లు నల్లగా మారిపోయాయని తెలిపింది. కిడ్నీలు కూడా విఫలమయ్యాయని తెలిపింది. ఆమె దాదాపు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి చేరిందని, కోమాలోకి వెళ్లినట్లు పేర్కొంది. ఆమె రెస్పిరేటర్‌లో ఉంది. ఇది తమకొక భయానక అనుభవం అని, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని మెస్సినా ఆవేదన వ్యక్తం చేసింది.

 లారా శరీరమంతా విషతుల్యంగా మారిపోయింది. ఆమె ప్రాణాలు కాపాడే క్రమంలో కాళ్లు, చేతులు పూర్తిగా దెబ్బతినడంతో వాటిని తొలగించారు వైద్యులు. ఆమెకు ప్రాణాలు నిలబెట్టేందుకు అత్యంత క్లిషమైన ఆపరేషన్ చేశారు. అయితే విబ్రియా వల్నిఫికస్ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ వల్ల లారాకు ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని వైద్యులు విశ్వసిస్తున్నారు. ఈ బాక్టీరియా కలుషితమైన వాటిని తినడం వల్ల లేదా.. సూక్ష్మజీవులు ఉన్న నీరు.. టాటూలు, ఇతర మార్గాల గుండా శరీరంలోకి చేరడమని యుసిఎస్ఎఫ్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ నటాషా స్పాటిస్ వుడ్ తెలిపారు. సముద్రపు జలచరాలను ఆహారంగా తీసుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి