iDreamPost

బ్రిడ్జిపై నుంచి పడిన యాత్రికుల బస్సు.. 21 మంది మృతి!

బ్రిడ్జిపై నుంచి పడిన యాత్రికుల బస్సు.. 21 మంది మృతి!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తలో వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలానే ఎంతో సంతోషంగా సాగే యాత్రల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే తమిళనాడులో యాత్రికుల బస్సు ప్రమాదానికి గురై.. 8 మంది చనిపోయారు. తాజాగా మరో యాత్రికుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.  ఈప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…

ఇటలీ దేశంలోని వెనిస్ నగర సమీపంలో పర్యాటకు బస్సు ప్రమాదానికి గురైంది.  పర్యాటకులంతా వెనీస్ లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్ సైట్ కు బయలు దేరారు. ఇక మరికొద్ది నిమిషాల్లో వారి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 50 అడుగుల బ్రిడ్జిపై నుంచి కిండ పడిపోయింది. ఈ  ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా 21 మంది మృతి చెందారు. మరికొందరు పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిండ పడగానే అందులోని మీథేన్  ఇంధనం లీకై మంటలు చెలరేగాయని సమాచారం. దీని కారణంగానే ప్రమాదం తీవ్రత బాగా పెరిగిందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదాంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక మృతుల్లో, క్షతగాత్రుల్లో  ఇటలీ పౌరులతో పాటు విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి