iDreamPost

మానవత్వం చాటుకున్న BSF.. బంగ్లాదేశ్‌ మహిళకు మర్చిపోలేని సాయం!

BSF Helps Bangladesh Lady: దేశ భద్రత విధుల్లోనే కాకుండా వివిధ రకాల విపత్తులు వచ్చిన మేము ఉన్నామంటూ ముందుండే వారే సైనికులు. అలానే ఇతర దేశాలతో వివాదలు ఉన్నా..అక్కడి ప్రజల విషయంలో మాత్రం మన మానవత్వాన్ని చూపిస్తుంటారు. తాజాగా ఓ బంగ్లా యువతి విషయంలో బీఎస్ఎఫ్ మానవత్వం చాటుకుంది.

BSF Helps Bangladesh Lady: దేశ భద్రత విధుల్లోనే కాకుండా వివిధ రకాల విపత్తులు వచ్చిన మేము ఉన్నామంటూ ముందుండే వారే సైనికులు. అలానే ఇతర దేశాలతో వివాదలు ఉన్నా..అక్కడి ప్రజల విషయంలో మాత్రం మన మానవత్వాన్ని చూపిస్తుంటారు. తాజాగా ఓ బంగ్లా యువతి విషయంలో బీఎస్ఎఫ్ మానవత్వం చాటుకుంది.

మానవత్వం చాటుకున్న BSF.. బంగ్లాదేశ్‌ మహిళకు మర్చిపోలేని సాయం!

మనం మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే అందుకు కారణం దేశ సైనికులు. వాళ్లు దేశ సరిహద్దులో ప్రాణాలు ఫణంగా పెట్టి మన కోసం విధులు నిర్వహిస్తున్నారు. మన దేశాన్ని, మనల్ని రక్షించండానికి వారి ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంటారు. అలా కేవలం దేశ భద్రత విధుల్లోనే కాకుండా వివిధ రకాల విపత్తులు వచ్చిన మేము ఉన్నామంటూ ముందుండే వారు సైనికులు. అలానే ఇతర దేశాలతో వివాదలు ఉన్నా..అక్కడి ప్రజల విషయంలో మాత్రం మన మానవత్వాన్ని చూపిస్తుంటారు. తాజాగా దేశ సరిహద్దుల్లో మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తండ్రి కడసారి చూపు చూసుకునేందుకు బంగ్లా యువతి సాయం చేశారు. మరి..పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నాడియా జిల్లాలో గురువారం రాత్రి మహబుల్‌ మండల్‌ (72) అనే వ్యక్తి వృద్ధాప్యం కారణంగా మరణించాడు. అయితే అతడి మార్తక్ మాండల్ అనే కుమార్తె ఉంది. ఆమె, వారి ఇతర కుటుంబ సభ్యులు బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్నారు. ఆయన గురువారం మరణించిన సంగతి..బంగ్లాదేశ్ లో ఉన్న కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. దీంతో తన తండ్రి మరణవార్త విని..ఆ యువతి గుండెలు పగిలేలా ఏడ్చింది. తన తండ్రి కడసారి చూపునైనా చూసుకోవాలని భావించింది.

 తన తండ్రిని చివరిసారి చూసే అవకాశం కల్పించాలని కోరుతూ మండల్ కుమార్తె సరిహద్దు భద్రతా దళ అధికారులను అభ్యర్ధించింది. అయితే భద్రత కారణాల దృష్ట్యా అనుమతించేందుకు సంశయించిన అధికారులు, తండ్రి మరణంతో బాధపడుతున్న ఆ కుమార్తె ఆవేదనను అర్థం చేసుకున్నారు.  మానవత హృదయంతో ఆలోచించి..పై అధికారులతో సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. ఆ మృతుడి కుమార్తె విన్నపంపై స్పందించిన బీఎస్‌ఎఫ్‌ 4వ బెటాలియన్‌ అధికారులు.. బోర్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌ తో సంప్రదింపులు జరిపారు. అనంతరం మృతుడి కుమార్తెతో పాటు ఇతర కుటుంబ సభ్యులను భారత్‌ -బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన జీరో లైన్‌ వద్ద కడసారి చూపు చూసేందుకు పర్మిషన్ ఇచ్చారు.

ఇరుదేశాల సైనికుల సమక్షంలో మృతదేహాన్ని సరిహద్దుకు తరలించారు. ఇక బీఎస్ఎఫ్ అధికారుల సాయంతో సరిహద్దు వద్దకు వచ్చిన తన తండ్రిని చివరిసారి చూసిన ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. తన తండ్రి చివరిచూపు చూసుకునేందుకు అవకాశం ఇచ్చిన బీఎస్‌ఎఫ్‌ అధికారులకు కృతజ్ఞత తెలిపారు. తన తండ్రి కడసారి చూపును చూసుకునేందుకు బీఎస్ఎఫ్ చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని మృతుడి కుమార్తె మార్తక్ మాండల్ అన్నారు.

సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాసే బీఎస్‌ఎఫ్‌ ఎల్లప్పుడూ మానవత్వం, మానవ విలువలకు కట్టుబడి ఉంటుందని దక్షిణ బెంగాల్ సరిహద్దుల డీఐజీ ఏకే ఆర్య తెలిపారు. అంతేకాదు, ఇరు దేశాల సరిహద్దుల్లో ఉండే ప్రజల మానవత, సామాజిక సంక్షేమం కోసం బీఎస్ఎప్ ఆలోచిస్తుందని తెలిపారు. మొత్తంగా బీఎస్ఎప్ చేసిన ఈ మానవత సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి