iDreamPost

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తీవ్ర అస్వస్థత!

KTR Has High Fever: తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికీ అన్ని పార్టీల నేతలు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తున్నారు.

KTR Has High Fever: తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికీ అన్ని పార్టీల నేతలు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తున్నారు.

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తీవ్ర అస్వస్థత!

తెలంగాణలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ దిగ్విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్ల పాలన కొనసాగించింది. అయితే 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తుంది. లోక్ సభ ఎన్నికలను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కేటీఆర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర జ్వరం, ఫ్లూ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ వైద్యులు పర్యవేక్షణలో ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే నేడు కరీంనగర్ లో నిర్వహించే కధనభేరి సభకు హాజరు కాలేనని ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించాలనే గట్టి పట్టుమీద ఉంది.  పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును సమీక్షించుకొని.. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక కరీంనగర్ లో జరగబోయే సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. మూడు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అపజయం కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలుపొంది పార్టీలో పూర్వ వైభవం తీసుకురావడానికి కట్టి ప్రయత్నం మీద ఉన్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన విశ్రాంతి లేకుండా వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్న కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి