iDreamPost

సీఎం జగన్ బాటలో మాజీ మంత్రి KTR!

YS Jagan, KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, పార్టీ వ్యవహారాల్లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇక ఆయన నిర్ణయాలను చాలా మంది నేతలు అనుసరిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ కూడా జగన్ దారిలో వెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది.

YS Jagan, KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, పార్టీ వ్యవహారాల్లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇక ఆయన నిర్ణయాలను చాలా మంది నేతలు అనుసరిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ కూడా జగన్ దారిలో వెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది.

సీఎం జగన్ బాటలో మాజీ మంత్రి KTR!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవ్వరూ ఊహించని పథకాలను ప్రవేశ పెట్టి.. అందరిని దృష్టిని ఆకర్షించారు. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ పాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఏపీలో అమలు అవుతున్న వాలంటీర్ వ్యవస్థ, అమ్మఒడి వంటి పథకాల అమలకు సన్నాహాకలు చేస్తున్నాయి. ఇలా సీఎం జగన్ కేవలం పరిపాలనలోనే కాకుండా పార్టీ పరంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు. జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చాలా నిర్ణయాలను ఇతర నాయకులు అనుకరిస్తున్నారు. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. సీఎం జగన్ దారిలో వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి.. ఏ విషయంలోనో, ఆ వివరాలు తెలుసుకుందాం..

2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి అధికారం కట్టబెట్టారు. అయితే మూడో సారి మాత్రం బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికి.. ప్రధానంగా ఒకటి వినిపిస్తోంది. అదే.. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న.. వారికే మరోసారి అవకాశం ఇచ్చారు. ఇదే ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. అధికారం పోతే తప్ప, బీఆర్ఎస్ కు జ్ఞానోదయం కాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ck jagan and ktr

తెలంగాణ భవన్ లో జహీరాబాద్ లోక్ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని కేటీఆర్ తెలిపారు. అప్పులు చూపించీ హామీల అమలు నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆయన తప్పు పట్టారు. బహుశా ఏపీలో  అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం జగన్ చేస్తున్న మార్పులు చేర్పులు కేటీఆర్ తో తమ పార్టీ సిట్టింగ్ ల విషయం గురించి  మాట్లాడేలా చేసి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

సర్వేల నివేదికల ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులకు జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 40 స్థానాల్లో అనేక మార్పులు చేశారు. ఇక జగన్ మార్క్ ఎంపిక చూసి తాము కూడా అలా మార్చి ఉంటే మంచి ఫలితాలు వచ్చే ఉండేవని మాజీ మంత్రి కేటీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకుని లోక్ సభ ఎన్నికల్లో ఆ తప్పు జరగనివ్వమని కేటీఆర్ అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎవరిపై అయితే వ్యతిరేకత అలాంటి ఎంపీలకు టికెట్లు దక్కవనికేటీఆర్ పరోక్షంగా చెప్పారు. మొత్తంగా ఏపీ సీఎం జగన్ దారిలో కేటీఆర్ వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి