iDreamPost

తమిళనాడులో రామ ప్రతిష్టాపన ప్రసారం నిషేధం! నిర్మలా సీతారామన్ ఫైర్!

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకను కన్నులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే రాముని జన్మ స్థానానికి చేరుకున్నారు. అయితే వెళ్లలేని వాళ్ల కోసం లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు జరిగాయి.. కాగా,

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకను కన్నులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే రాముని జన్మ స్థానానికి చేరుకున్నారు. అయితే వెళ్లలేని వాళ్ల కోసం లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు జరిగాయి.. కాగా,

తమిళనాడులో రామ ప్రతిష్టాపన ప్రసారం నిషేధం! నిర్మలా సీతారామన్ ఫైర్!

శ్రీరామ నామ జపంతో యావత్ భారతావని పులకరించిపోతుంది. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరే సమయం ఆసన్నమైంది. అక్కడ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాముని ప్రాణ ప్రతిష్టను కన్నులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వెళ్లారు. ఎన్నో ఏళ్ల నాటి నుండి ఎదురు చూస్తున్న ఆశలకు శ్రీరాముని ప్రతిష్టాపనతో నెరవేరనుంది. ఇప్పటికే సెలబ్రిటీలు సైతం అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం జ‌న‌వ‌రి 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో లైవ్ టెలికాస్ట్ ప్రసారం కానుంది.

కాగా, తమిళనాడు ప్రభుత్వం అయోధ్య రామ మందిరంలోని ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేస్తుందంటూ వార్తలు గుప్పుమన్నాయి.  దీనిపై కేంద్ర మంత్రి, బీజెపీ నేత నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్‌ను స్టాలిన్ ప్రభుత్వం నిషేధించిందంటూ ఓ వార్త కథనాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఆమె డీఎంకే సర్కార్ పై ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 200 రామాలయాలతో పాటు మిగిలిన దేవాలయాల్లో అన్నదానం, పూజా కార్యక్రమాలు చేపట్టొద్దని హెచ్ఆర్ అండ్ సీఈ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని ఆ పత్రిక కథనంలో రాసి ఉంది. దీన్ని ఉటంకిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు.

Ban on telecasting Rama installation in Tamil Nadu

‘తమిళనాడు గవర్నమెంట్ జనవరి 22 నుండి 24 వరకు అయోధ్య రామ మందిర్ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడాన్ని నిషేధించింది. తమిళనాడులో శ్రీరామునికి 200 పైగా ఆలయాలు ఉన్నాయి.హెచ్ఆర్ అండ్ సీఈ నిర్వహించే దేవాలయాల్లో శ్రీరాముని పేరు మీద పూజ/భజన/ప్రసాదం/అన్నదానం చేయొద్దు. ప్రయివేటు ఆలయాల్లో కూడా కార్యక్రమాలు జరగకుండా పోలీసులు చూస్తున్నారు. అలాగే కొంత మందిని బెదిరిస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేక, ద్వేషపూరిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా, నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను స్టాలిన్ ప్రభుత్వం తీవంగ్రా ఖండించింది. ప్రజల దృష్టి మరల్చడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శేఖర్ పేర్కొన్నారు. ఒక వార్త కథనాన్ని ఆధారం చేసుకుని కేంద్ర మంత్రి కామెంట్స్ చేయడం, వాటిని తిప్పికొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి