iDreamPost

స్టార్ సింగర్​ బ్రిట్నీ స్పియర్స్​కు ఘోర అవమానం.. కింద పడేసి..!

  • Author singhj Published - 04:23 PM, Fri - 7 July 23
  • Author singhj Published - 04:23 PM, Fri - 7 July 23
స్టార్ సింగర్​ బ్రిట్నీ స్పియర్స్​కు ఘోర అవమానం.. కింద పడేసి..!

పాప్ మ్యూజిక్​ను ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. పాప్ సంగీతం అంటే చెవి కోసుకునే వారి సంఖ్య కోట్లలోనే ఉంది. పాప్ స్టార్స్​కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఫిలిం స్టార్స్, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు ఉండే రేంజ్​లో వీళ్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫుల్ క్రేజ్ కలిగిన పాప్ స్టార్ సింగర్లలో బ్రిట్నీ స్పియర్స్ ఒకరు. ఆమె పేరు చెబితే చాలు.. అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అంతలా సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు బ్రిట్నీ. సింగర్​గానే గాక పాటల రచయిత్రిగానూ ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు. బ్రిట్నీ నుంచి ఒక ఆల్బమ్ వస్తోందంటే చాలు.. ప్రేక్షకులు కళ్లలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు.

బ్రిట్నీ స్పియర్స్ తన పాటలతో వరల్డ్ వైడ్​గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆమె షోలను చూసేందుకు ఆడియెన్స్ ఎగబడేవారు. బ్రిట్నీ ప్రొఫెషనల్ లైఫ్​తో పాటు ఆమె పర్సనల్ లైఫ్​లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఫ్యాన్స్. అలాంటి బ్రిట్నీ స్పియర్స్​కు ఘోర అవమానం ఎదురైంది. లాస్​ వెగాస్​లోని ఒక హోటల్​లో ఆమెకు అవమానం జరిగింది. పాపులర్ ఎన్బీఏ స్టార్, ఫ్రాన్స్​కు చెందిన విక్టర్ వెంబన్యామ (19) అంటే బ్రిట్నీకి చాలా ఇష్టం. తాను డిన్నర్​కు వెళ్లిన హోటల్​లో వెంబన్యామ తారసపడటంతో అతడితో ఫొటో దిగేందుకు బ్రిట్నీ స్పియర్స్ వెంటపడ్డారు. అతడి వీపు మీద బ్రిట్నీ వెనుక నుంచి చరిచారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను నెట్టేశారు.

సెక్యూరిటీ సిబ్బంది నెట్టేయడంతో బ్రిట్నీ స్పియర్స్ కిందపడిపోయారు. ఆమె కళ్లద్దాలు కూడా కిందపడ్డాయి. ఈ ఘటనపై ఆమె ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బ్రిట్నీకి ఇంతటి అవమానమా అంటూ ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై వెంబన్యామ స్పందిస్తూ.. ఎవరో తనను వెనుక నుంచి వచ్చి గట్టిగా హత్తుకున్నారని, దీంతో సెక్యూరిటీ సిబ్బంది బలంగా నెట్టేశారని అన్నారు. వాళ్లు తోసింది బ్రిట్నీ స్పియర్స్​ను అని తర్వాత తెలిసిందన్నారు. మరోవైపు బ్రిట్నీ మాత్రం తాను వెంబన్యామను బలంగా కొట్టలేదని, సున్నితంగా పిలిచానని చెబుతూ నెట్టింట విషయాన్ని వివరిస్తూ ఒక పోస్ట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Maria River Red (@britneyspears)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి