iDreamPost

బ్రిటన్‌ రాజుకు కరోనా..! ఎలా సోకిందంటే..?

బ్రిటన్‌ రాజుకు కరోనా..! ఎలా సోకిందంటే..?

బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ చార్లెస్‌ (72)కు కరోనా వైరస్‌ సోకింది. స్కాట్‌లాండ్‌లో ఉంటున్న ఆయన కొన్ని రోజులుగా వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అయినా ఆయన కరోనా బారిన పడ్డారు. రాణి ఎలిజిబెత్‌కు కూడా కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌ అని తేలింది.

రాజు ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. రాజ ప్రసాదంలోకి వైరస్‌ వ్యాపించడంతో వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులు క్రితం ప్రిన్స్‌ చార్లెస్‌ పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లోనే వైరస్‌ ప్రిన్స్‌ చార్లెస్‌కు సోకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రిన్స్‌ చార్లెస్, రాణి ఎలిజిబెత్‌లు ఇద్దరూ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

తనకు రాజు , పేద అన్న వ్యత్యాసం లేదని కరోనా వైరస్‌ నిరూపిస్తోంది. ఈ మహమ్మరి నుంచి బయటపడేందుకు సోషల్‌ డిస్టెన్స్‌ ఒక్కటే మార్గమని బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ చార్లెస్‌ ఉదంతం చెబుతోంది. అందుకే ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ అయ్యాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వాలు వేడుకుంటున్నాయి. మన దేశంలో రెండు రోజుల వ్యవధిలో దేశ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. రెండు దఫాల్లో గంటపాటు మాట్లాడిన మోదీ.. అనేక సార్లు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం గురించి నొక్కి మరీ చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి