iDreamPost

తెలుగులో మమ్ముట్టి ‘భ్రమయుగం’రిలీజ్ డేట్ వచ్చేసింది!

Bramayugam Movie Release Date: మెగాస్టార్ మమ్ముట్టి అంటే జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు. మమ్మట్టి నటించిన హర్రర్-థ్రిల్లర్ మూవీ తెలుగులో రిలీజ్ కి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Bramayugam Movie Release Date: మెగాస్టార్ మమ్ముట్టి అంటే జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు. మమ్మట్టి నటించిన హర్రర్-థ్రిల్లర్ మూవీ తెలుగులో రిలీజ్ కి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

తెలుగులో మమ్ముట్టి ‘భ్రమయుగం’రిలీజ్ డేట్ వచ్చేసింది!

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 70 ఏళ్ల వయసులో కూడా కుర్రహీరోలకు పోటీగా నటిస్తున్నారు. నటుడిగా ఎంత గొప్ప పేరు ఉన్నా.. ప్రతిసారీ తనదైన శైలిలో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ మద్య ‘కాథల్ : ది కోర్’ మూవీలో గే పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ‘భ్రమ యుగం ’ మూవీతో మరో అద్భుతమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైకలాజికట్ హర్రర్-థ్రిల్లర్ మూవీగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించిన ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ డేట్ వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించిన మాలీవుడ్  బ్లాక్ బ్లస్టర్ మూవీ ‘భ్రమయుగం’ తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఫిబ్రవరి 23న రిలీజ్ చేయబోతున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. జాతీయ స్థాయిలో మంచి గుర్తిపు తెచ్చుకున్న  మమ్ముట్టి ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాలు అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. మమ్ముట్టి తాజా మూవీ ‘భ్రమ యుగం’అందరి దృష్టి ఆకర్శించింది. ఈ మూవీలో మమ్ముట్టి డిఫరెంట్ లుక్ తో మరో అద్భుతాన్ని క్రియేట్ చేసి ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.

పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ మూవీ ‘భ్రమయుగం’ మూవీకి భూతకాలం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. మాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వైవిధ్యమైన కథాంశం, మమ్ముట్టి నటన ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి. ఈ మూవీ తెలుగు లో హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకొని.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 5 భాషల్లో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.. ‘ఇవి పావులు.. రెండు పాచికలు పడ్డ సంఖ్యను బట్టి పావులను జరపాలి.. ముందుగా ఇక్కడికి చేరిన వాళ్లు గెలిచినట్లు.. దానికి భాగ్యం ఉండాలి’ అనే డైలాగ్ లో ఎన్నో అర్థాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రయోగాత్మక చిత్రం తెలుగు లో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి