iDreamPost

శ్రీవారికి APమంత్రి ఖరీదైన కానుక.. ఏకంగా బంగారు సింహాసనం అందజేత

  • Published Oct 23, 2023 | 12:21 PMUpdated Oct 23, 2023 | 12:21 PM

ఏపీ మంత్రి ఒకరు శ్రీవారికి ఖరీదైన కానుక అందించారు. ఏకంగా బంగారు సింహాసనం బహుకరించారు. అయితే అది తిరుమల శ్రీవారికి కాదు.. మరి ఎక్కడ అంటే..

ఏపీ మంత్రి ఒకరు శ్రీవారికి ఖరీదైన కానుక అందించారు. ఏకంగా బంగారు సింహాసనం బహుకరించారు. అయితే అది తిరుమల శ్రీవారికి కాదు.. మరి ఎక్కడ అంటే..

  • Published Oct 23, 2023 | 12:21 PMUpdated Oct 23, 2023 | 12:21 PM
శ్రీవారికి APమంత్రి ఖరీదైన కానుక.. ఏకంగా బంగారు సింహాసనం అందజేత

తిరుమల శ్రీవారు దేశంలోనే అత్యంత ధనిక దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలో ఎక్కెడెక్కడి నుంచో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వస్తారు. భారీ ఎత్తున కానుకలు సమర్పిస్తారు. బంగారం, నగదు, ఆభరణాలు, వజ్రాలను కూడా కానుకగా సమర్పించుకుంటారు. శ్రీవారి పేరు మీద లెక్కలేనంత సంపద ఉంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు.. తిరుమల వెళ్లిన వారంతా స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తారు. తిరుమల హుండీకి రోజు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక స్వామి వారికి సమర్పించే బంగారు ఆభరణాలకైతే లెక్కే లేదు.

అయితే ఏపీలో తిరుపతితో పాటు.. ద్వారకా తిరుమల అంతే ప్రసిద్ధి పొందింది. దీన్ని చిన్న తిరుమల అంటారు. తిరుపతి వెళ్లలేని వారు.. ఇక్కడే మొక్కులు సమర్పించుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ద్వారకా తిరుమల శ్రీవారికి ఏపీ మంత్రి ఒకరు ఖరీదైన కానుక అందజేశారు. స్వామి వారికి ఏకంగా బంగారు సింహాసనం అందజేశారు. ఆ వివరాలు..

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారకా తిరుమల శ్రీవారికి విలువైన కానుకను అందజేశారు. స్వామి వారికి బంగారు సింహాసనం బహుకరించారు. బొత్స భార్య, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి రాగి రేకుపై బంగారు తాపడం చేసిన సింహాసనాన్ని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావుకు అందించారు. ఆ సింహాసనం విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. సింహాసనాన్ని స్వామివారికి జరిగే నిత్య కళ్యాణంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా దాత కోరారు. సింహాసనం అందజేసిన సందర్భంగా బొత్స దంపతులకు ఈవో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మరోవైపు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. స్వామివారు రోజుకో విశేష అలంకారంలో.. వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్‌ 26న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి