iDreamPost

ఘనంగా బాలీవుడ్ స్టార్ హీరో- టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్!

Star Hero- Heroine Become Couple: సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు బీ టౌన్ తారలు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వారి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Star Hero- Heroine Become Couple: సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు బీ టౌన్ తారలు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వారి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఘనంగా బాలీవుడ్ స్టార్ హీరో- టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్!

ఇండియన్ సినిమాలో ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఒకే ఇండస్ట్రీలో కలిసి ఉండటం, ఒకే సినిమాలో పని చేసిన పరిచయం ప్రేమగా మారడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒకటవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాగే ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వారి పెళ్లికి సంబంధించిన విషయాలను తమ అభిమానులు, నెటిజన్స్ తో పంచుకున్నారు. అలాగే వారి పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు మరెవరో కాదు.. కృతి కర్బందా- పుల్ కిత్ సామ్రాట్. మార్చి 15న వాళ్లు ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈరోజు వారి పెళ్లి ఫొటోలను తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి ఫ్యాన్స్ కి ఈ విషయాన్ని వెల్లడించారు. బంధు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వారి ప్రేమను పెళ్లి బంధంగా మార్చకున్నారు. వారి పెళ్లి ఫొటోలు చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి స్టన్నింగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

పేస్టల్ గ్రీన్ కలర్ వెడ్డింగ్ డ్రెస్ లో పులకిత్ సామ్రాట్ మహారాజు లుక్స్ లో కనిపించాడు. కృతి కర్బందా కూడా ఒక యువరాణి తరహాలో ముస్తాబయ్యింది. వీరి ఫొటోలు చూసిన ఫ్యాన్స్ అచ్చం ఒక మహారాజు వివాహం చూసినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బీ టౌన్ లో వీరి మ్యారేజ్ న్యూస్ వైరల్ గా మారింది. వీళ్ల కెరీర్ విషయానికి వస్తే.. పులకిత్ సామ్రాట్- కృతి కర్బందా గతంలో చాలానే సినిమాల్లో కలిసి నటించారు. 2018లో వీళ్లిద్దరు వీరేకి వెడ్డింగ్ అనే సినిమాలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత 2019లో పాగల్ పంతి సినిమాలో వీళ్లిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బెజోయ్ నంబియార్స్ టైష్ అనే సినిమాలో కూడా వీళ్లిద్దరు కలిసి నటించారు.

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

ఇంక కృతి కర్బందా అయితే తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించింది. ఆమె కెరీర్ లో హౌస్ ఫుల్ 4, పాగల్ పంతి వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో అయితే ఒంగోలు గిత్త, బ్రూస్ లీ, తీన్ మార్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈమెకు బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే ఇప్పుడు తెలుగు చిత్రాలకు కాస్త దూరంగా ఉంటోంది. ఇంక పులకిత్ సామ్రాట్ విషయానికి వస్తే.. డాలీ కి డోలీ, బంగిస్తాన్, సనం రే, జూనియాత్, హాతీ మేరే సాతీ వంటి చిత్రాల్లో నటించాడు. అలాగే ఏక్తా కపూర్ టీవీ సిరీస్ లో కూడా పులకిత్ సామ్రాట్ నటించి మెప్పించాడు. మరి.. ఈ నూతన వధూవరులకు కామెంట్స్ రూపంలో వివాహ శుభాకాంక్షలు తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి