iDreamPost

Sanjay Dutt: సచిన్ కాదు, ధోని కాదు.. ఆ పాక్ క్రికెటర్ మాత్రమే తోపు: సంజయ్ దత్

సచిన్ టెండుల్కర్, ధోని కాదు.. ఆ పాక్ ప్లేయర్ తోపు అంటూ, అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్. ఆ వివరాల్లోకి వెళితే..

సచిన్ టెండుల్కర్, ధోని కాదు.. ఆ పాక్ ప్లేయర్ తోపు అంటూ, అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్. ఆ వివరాల్లోకి వెళితే..

Sanjay Dutt: సచిన్ కాదు, ధోని కాదు.. ఆ పాక్ క్రికెటర్ మాత్రమే తోపు: సంజయ్ దత్

ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్లు ఎవరు అంటే? చాలా మంది పేర్లే లిస్ట్ లో ఉంటాయి. అందులో కచ్చితంగా ఉండే భారత ఆటగాళ్లు కొందరు ఉన్నారు. వారిలో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తో పాటుగా వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, ద్రవిడ్, మహేంద్రసింగ్ ధోని లాంటి మేటి క్రికెటర్లు ఉన్నారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి ఎందరో స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పడు వీళ్లందరి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా? దానికీ ఓ కారణం ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు దేశంలో ఉన్న ఏ క్రికెటర్ కూడా నచ్చలేదట. ఆ పాక్ ప్లేయర్ అందరికంటే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చాడు సంజయ్ దత్.

దుబాయ్ వేదికగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఈ వేడుకలో అతడు చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో సంజయ్ దత్ పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు, మాజీ పేసర్ వసీం అక్రమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అక్రమ్ స్వింగ్ బౌలింగ్ గురించి పొగడ్తల్లో ముంచెత్తాడు. వసీం అక్రమ్ గురించి సంజయ్ దత్ మాట్లాడుతూ..”ప్రపంచలోనే వసీం అక్రమ్ గొప్ప బౌలర్. అతడు రివర్స్ స్వింగ్ లో సిద్దహస్తుడు. నా లైఫ్ లో నేను చూసిన గొప్ప క్రికెటర్లలో వసీం ఒకడు. అతడి రివర్స్ స్వింగ్ బ్యాటర్లను బెంబేలు ఎత్తిస్తుంది. అందుకే అక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం” అంటూ ఆకాశానికి ఎత్తేశాడు సంజూ భాయ్.

pakistan cricketer is best

అయితే ఈ సందర్భంగా ఒక్క టీమిండియా ప్లేయర్ పేరు కూడా సంజయ్ గుర్తుచేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, మహేంద్రసింగ్ ధోని లాంటి ఎందరో దిగ్గజ క్రికెటర్లు ఇండియాలో ఉన్నప్పటికీ.. వారి పేర్లను చెప్పకపోవడం అందరిని షాక్ కు గురిచేసింది. దీంతో సంజయ్ దత్ పై టీమిండియా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. శత్రు దేశంలో ఉన్న ఆటగాడు మీకు కనిపించాడు కానీ.. మన దేశంలో ఉన్న స్టార్ ప్లేయర్లు మీ కంటికి కనిపించలేదా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పించారు. కాగా.. వసీం అక్రమ్ 350 వన్డేల్లో 502 వికెట్లు, 104 టెస్టుల్లో 414 వికెట్లు తీసి దిగ్గజ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. మరి ఏ ఒక్క ఇండియన్ క్రికెటర్ పేరు చెప్పకుండా తనకు వసీం అక్రమ్ బౌలింగ్ అంటే ఇష్టమని చెప్పిన సంజయ్ దత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి