iDreamPost

కొత్తగా తమరు చెప్పేది ఏంది సునీల్ గారు ..?

కొత్తగా తమరు చెప్పేది ఏంది సునీల్ గారు ..?

ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి రాజకీయ పార్టీ కృషి చేస్తుంది. ఎలా అయినా గెలవాలనే ఆశ.. నోటిని అదుపులో ఉంచకుండా చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు పరిధిని మించి మాట్లాడుతున్నారు.

తాజాగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆ పార్టీ రాష్ట్ర కో ఇంచార్జి సునీల్ దేవధర్ ఇలాగే నోరు పారేసుకున్నారు. సీఎం జగన్ బెయిల్ పై ఉన్నారని, ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని జోస్యం చెప్పారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి జైల్ కు వెళ్లారు… బెయిల్ పై వున్నారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్ జైలు కు ఎందుకు వెళ్ళాడు అనే విషయం కూడా తెలిసిందే. ఆయన జైలులో ఉన్నప్పుడే ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో లో 19 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 17 స్థానాలలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో 40 శాతం ఓట్లతో 67 ఎమ్మెల్యే, 9 ఎంపీలను గెలిపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ సీపీ కంటే కేవలం 5 లక్షల ఓట్లు ఎక్కువ తెచుకోగలిగారు.

ఇక, జగన్ బెయిల్ విషయం మాట్లాడాల్సింది బీజేపీ నాయకులా లేక కోర్టులా? కోర్టు విచారణలో ఉన్న అంశాలను బహిరంగంగా ప్రస్తావించడం ద్వారా ఆయన ఎవరిని బెదించదలచుకున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Also Read: పరిషత్‌ ఎన్నికలపై కోర్టుకు బీజేపీ

సోనియాగాంధీ లాంటి శక్తిమంతురాలినే ఎదురించి నిలిచిన విషయం బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. అలాంటి వ్యక్తి ఇలాంటి వారి తాటాకు చప్పట్లకు భయపడతాడా.? బీజేపీ నాయకులకు చేతనైతే ప్రధాని మోడీ చేస్తున్న ఘనకార్యాలు, అభివృద్ధి పనులు చెప్పుకుని ఓట్లు అడుక్కోవాలి. అంతే తప్ప జగన్ బెయిల్ మీదున్న సంగతి ప్రజలకు తెలియదా? ఆ సంగతి తెలియకనే జనం ఆయన పార్టీకి నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు, ఇరవై రెండు లోక్ సభ సీట్లు ఇచ్చారా? ఈయన బెదిరింపులకు జగన్ భయపడతాడని ఈయన భ్రమిస్తున్నాడా?

ఫలితం ఇవ్వదు సునీల్ జీ..!

గత లోక్ సభ ఎన్నికల ముందు నేషనల్ హెరాల్డ్ కేసును బూచిగా చూపి కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి బీజేపీ నెట్టింది. అయితే అన్ని చోట్లా అదే స్ట్రాటజీ ఫలితాలు ఇవ్వదనే విషయం సునీల్ దేవధర్ తెలుసుకోవాలి. మొత్తం దేశంలో బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంత మంది బెయిల్ పై ఉన్నారో చెప్పే ధైర్యం ఉందా మీకు..? తిరుపతిలో మీ అభ్యర్థి మీదే కేసులు ఉండి ఆ తరువాత కేస్ కొట్టేసిన సంగతి మర్చిపోతే ఎలా.. ? జగన్ మీద పెట్టిన 11 చార్జ్ షీట్లలో ఎనిమిదింటిని కోర్టులు కొట్టేసిన విషయం తెలియదా..? మిగిలిన అన్ని కేసులను ఒకేసారి విచారించాలని స్వయంగా జగన్ మోహన్ రెడ్డే కోర్టులో అభ్యర్థించిన విషయం మర్చిపోతే ఎలా సార్. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మాట్లాడాలి సునీల్ గారు.

ఇక, ఎన్నికల్లో ప్రచారం అనేది పరిపాలనా అంశాలమీద, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలను ఒప్పించాలి. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎత్తి చూపి ఓట్లడగాలి. సీఎం జగన్ ఏవైనా తప్పులు చేస్తుంటే వాటిని ఎత్తి చూపించి ప్రజల మెప్పు పొందాలి. అంతే తప్ప ఇలాంటి మాటలు వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరుతుంది. అయినా తాటాకు చప్పుళ్లకు భయపడే స్థితిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లేరన్న విషయం బీజేపీ నాయకులు గుర్తెరిగి మాట్లాడాలి.

Also Read : అవకాశాన్ని అందిపుచ్చుకున్న సోము

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి