iDreamPost

APలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం! 3 నెలలు చికెన్ షాపుల బంద్‌కు ఆదేశం!

గత రెండేళ్ల క్రితం బర్డ్ ఫ్లూ వల్ల కోట్ల సంఖ్యల్లో కోళ్లు చనిపోయాయి. దీని వల్ల మనుషులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది.

గత రెండేళ్ల క్రితం బర్డ్ ఫ్లూ వల్ల కోట్ల సంఖ్యల్లో కోళ్లు చనిపోయాయి. దీని వల్ల మనుషులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది.

APలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం! 3 నెలలు చికెన్ షాపుల బంద్‌కు ఆదేశం!

ఇటీవల ప్రపంచంలో కొత్త కొత్త వైరస్ లు మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త వైరస్ ల భారిన పడి జంతువులు, పక్షులు కూడా విల విలలాడిపోతున్నాయి.  డేంజరస్ వైరస్ లో ఒకటి బర్డ్ ఫ్లూ. ఈ వ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షి జాతులకు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఇది హెచ్5ఎన్1 (H5N1)అనే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. గతంలో భారత్ లో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. లక్షల సంఖ్యల్లో కోళ్లను చంపేశారు. కొన్ని చోట్ల అయితే ఒక్క రూపాయికి లేదా ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో కోళ్ల పరిశ్రమ యాజమానులో భారీగా నష్టపోయారు. ఏపీలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పౌల్ట్రీ యాజమాన్యానికి మళ్లీ పిడుగు లాంటి వార్త కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

రెండేళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయం సృష్టించింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ తర్వాత కరోనా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనుకుంటున్న సమయంలో తెలుగు ప్రజలకు మరో కొత్త వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతుంది. వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కోవూరు మండలాల్లో భారీగా కోళ్ల మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగాం కోళ్ల శాంపిల్స్ తీసుకొని భోపాల్ ల్యాప్ కి పంపించారు. తాజాగా రిపోర్ట్స్ లో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూ నే కారణం అని అధికారులు నిర్దారించారు.

నెల్లూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ అని తెలియగానే ప్రజలు భయాంతోళనకు గురి అయ్యారు. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం అత్యవసర భేటీ ఏర్పాటు చేసి ఈ వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్లకు దాదాపు కిలో మీటర్ల దూరంలో 3 నెలల వరకు చికెన్ షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ ని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి