iDreamPost

గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది.. అసలు ఏం జరిగిందంటే?

గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది.. అసలు ఏం జరిగిందంటే?

ప్రేమ కోసం ప్రేమించిన ప్రియురాలికోసం దేనికైన సిద్దపడుతుంటారు కొంతమంది ప్రియులు. ఆమె కోసం ఖరీదైన గిఫ్టులు అందిస్తుంటారు. ప్రేమించిన అమ్మాయి బర్త్ డే సెలబ్రేషన్స్ వేరే లెవల్ లో ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇదే రీతిలో ఓ యువకుడు తన ప్రియురాలి పుట్టిన రోజునాడు విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అలా వెళ్లిన అతడికి ఊహించని షాక్ తగిలింది. ఆమె పుట్టిన రోజు ఏమోగాని ఇతగాడి ప్రాణాల మీదికి వచ్చిపడ్డది. చావు అంచుల వరకు వెళ్లిన ఆ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బిహార్ లోని ఛప్రాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రియురాలి పుట్టిన రోజునాడు ఆమెకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెబుదామని ఆమె ఇంటికి అర్థరాత్రి వేళ వెళ్లాడు ఓ యువకుడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల కంటపడ్డాడు. ప్రియురాలిని సర్ ప్రైజ్ చేద్దామని వెళ్తే.. రివర్స్ లో ఇతడికే సర్ ప్రైజ్ ఇచ్చారు ఆ యువతి కుటుంబ సభ్యులు. ఇంకేముంది యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. వారి దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆ యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన ఆ యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకుడిని వీల్ చైర్ సాయంతో ఆసుపత్రిలోకి తీసుకెళ్తున్న దృష్యాలు ఆ వీడియోలో చూడొచ్చు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి