iDreamPost

డ్రీమ్‌ 11లో కోటిన్నర గెలిచిన మెకానిక్‌! అదృష్టం అంటే నీదే స్వామి!

  • Published Apr 25, 2024 | 2:20 PMUpdated Apr 25, 2024 | 2:20 PM

Bihar, Dream 11, KKR vs RCB: అదృష్టం ఉండాలే కానీ, డబ్బు తనంతట తానే వస్తుంది అనేందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ మెకానిక్‌ ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ అదృష్ట ఘటన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Bihar, Dream 11, KKR vs RCB: అదృష్టం ఉండాలే కానీ, డబ్బు తనంతట తానే వస్తుంది అనేందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ మెకానిక్‌ ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ అదృష్ట ఘటన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 25, 2024 | 2:20 PMUpdated Apr 25, 2024 | 2:20 PM
డ్రీమ్‌ 11లో కోటిన్నర గెలిచిన మెకానిక్‌! అదృష్టం అంటే నీదే స్వామి!

కోట్లు సంపాదించాలనే కల చాలా మందిలో ఉంటుంది. ఏదో ఒకటి చేసి.. లక్షాధికారి, కోటీశ్వరులు అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ, చాలా మంది కల కలగానే మిగిలిపోతుంది. అయితే.. అదృష్టం ఉంటే ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయిపోవచ్చు.. ఓవర్‌నైట్‌ స్టార్‌లాగా ఓవర్‌నైట్‌ కోటీశ్వర్‌. ఇలాంటివి జరగాలంటే కచ్చితంగా చాలా అదృష్టం ఉండాలి. అంతటి అదృష్టం ఉన్న ఓ మెకానిక్‌కు తాజాగా జాక్‌పాట్‌ దక్కింది. ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. డ్రీమ్‌ ఎలెవన్‌ యాప్‌లో ఏకంగా కోటిన్నర రుపాయలు గెలుచుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని అర్రా జిల్లా ఖోడా గ్రామానికి చెందిన దీపు ఓఝా అనే వ్యక్తి డ్రీమ్‌ ఎలెవన్‌లో కోటిన్నర రుపాయలు గెలుచుకున్నాడు. 8వ తరగతి మధ్యలోనే ఆపేసిన దీపు.. స్థానికంగా ఉన్న ఓ గ్యారేజీలో మెకానిక్‌గా పనిచేస్తూ.. జీవనోపాధి పొందుతున్నాడు. అయితే.. చాలా మంది లాగే దీపుకు కూడా క్రికెట్‌ అంటే పిచ్చి ఇష్టం. ప్రస్తుతం ఐపీఎల్‌ 17వ సీజన్‌ నడుస్తుండటంతో.. మ్యాచ్‌లు చూడటంతో పాటు డ్రీమ్‌ ఎలెవన్‌ అనే ఫాంటసీ గేమ్‌ యాప్‌లో తన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేసుకుని, భారీ ప్రైజ్‌మనీ పొందాడు. ఈ నెల 21న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో తన డ్రీమ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేసుకున్నాడు దీపు.

కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ జట్టు ఒక్క పరుగుతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ 20 బంతుల్లో 27 పరుగులతో పాటు, బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 25 రన్స్‌ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీపు కూడా రస్సెల్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడంతో.. తన డ్రీమ్‌ ఎలెవన్‌ పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. ఏకంగా కోటిన్నర రుపాయలు గెలిచింది. ఈ డబ్బులో ట్యాక్సులు కట్‌ అయి.. మిగిలిన మొత్తం దీపు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అయ్యాయి. మరి ఒక మెకానిక్‌ డ్రీమ్‌ ఎలెవన్‌లో కోటిన్నర్‌ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి