iDreamPost

బిగ్‌బాస్‌ ఇప్పుడు సామాన్యుల కోసం.. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా??

బిగ్‌బాస్‌ ఇప్పుడు సామాన్యుల కోసం.. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా??

బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ గతంలో అయిదు సీజన్లు పూర్తి చేసుకొని తర్వాత ఓటీటీలో బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ పేరుతో టెలికాస్ట్ అయింది. అయితే దానికి అంతగా ఆదరణ దక్కకపోవడంతో అనుకున్న దానికంటే ముందుగానే బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ ని ముగించేశారు. ఇటీవలే ఆ షో పూర్తయి బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. గ్యాప్ కూడా లేకుండా ఈ సారి మళ్ళీ టీవిలో టెలికాస్ట్ చేసేందుకు నిర్వాహకులు అప్పుడే బిగ్‌బాస్‌ సీజన్ 6ని కూడా మొదలు పెట్టేస్తున్నారు.

త్వరలోనే బిగ్‌బాస్‌ సీజన్ 6 ప్రారంభం అవ్వనుంది. మాములుగా బిగ్‌బాస్‌ షోలో ఆల్రెడీ ఫేమ్ ఉన్న వారిని, అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సెలబ్రిటీలని, కాస్తో కూస్తో జనాలకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి హౌస్ లో ఉంచుతారు. అయితే ఈ సారి బిగ్‌బాస్‌ షోలో సామాన్యులకి కూడా అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియోని కూడా రిలీజ్ చేసారు. బిగ్‌బాస్‌ సీజన్ 6 కూడా నాగార్జుననే హోస్ట్ గా చేయనున్నారు. దీంతో నాగార్జునచే ఓ వీడియోని చేయించి రిలీజ్ చేశారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు.

ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో సామాన్యులకు కూడా ఇంట్లోకి ఆహ్వానం ఉంది. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూసి ఆనందించారు. ఇప్పుడు మీరు కూడా బిగ్‌బాస్‌ హౌస్ లో ఉండొచ్చు. అందుకే స్టార్‌ మా ఇస్తోంది ఆకాశాన్ని అందుకునే అవకాశం, వన్‌ టైం గోల్డెన్‌ ఛాన్స్‌, టికెట్‌ టు బిగ్‌బాస్‌ సీజన్‌ 6. మరిన్ని వివరాల కోసం స్టార్‌ మా వారి వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి” అని తెలిపారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో సామాన్య ప్రజలు పాల్గొనాలి అంటే starmaa.startv.com వెబ్ సైట్ ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సారి బిగ్‌బాస్‌ లో భాగమవ్వాలి అనుకుంటే ఇప్పుడే వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలు ఇచ్చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి