iDreamPost

బిగ్ బాస్ రేటింగ్ భారీగానే ఉంది కానీ

బిగ్ బాస్ రేటింగ్ భారీగానే ఉంది కానీ

వివాదాలు, విమర్శలు, అభిమానాల మధ్య నడిచే బిగ్ బాస్ అయిదో సీజన్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడో సారి దీన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జునను ఈసారి జనం ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎప్పటిలాగే పార్టిసిపెంట్స్ విషయంలో కామెంట్లు ఇంకాస్త గట్టిగా ఉన్నాయి. సోషల్ మీడియా ఫేమ్ ఎక్కువగా ఉన్న వారిని తీసుకొచ్చి సామాన్య ప్రేక్షకులకు అంతగా అవగాహన లేనివాళ్ళతో గేమ్ ఆడిస్తున్నారన్న మాటలు ఈ అయిదో సీజన్ లాంచ్ ఎపిసోడ్ తర్వాత గట్టిగానే వినిపించాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ కి ఎంత టిఆర్పి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఫిగర్స్ వచ్చేశాయి.

బిగ్ బాస్ సీజన్ 5కు దక్కిన రేటింగ్ 15.7. ఇది చాలా మంచి నెంబర్. కానీ సంబరపడడానికి లేదు. ఎందుకంటే గతంలో వచ్చిన అన్ని లాంచింగ్ లను ఇది క్రాస్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే గత ఏడాది లాక్ డౌన్ టైంలో వచ్చిన దాని కన్నా తక్కువ తెచ్చుకుంది. సీజన్ 4 రేటింగ్ 18.5. అంటే సుమారు 3కు పైగా వ్యత్యాసం ఉంది. మూడో సిరీస్ కూడా ఎక్కువే. 17.92 దక్కింది. అంటే నాగార్జున హోస్ట్ చేసిన మూడు సీజన్లలో తక్కువ వచ్చింది ఇప్పుడే. హడావిడి లేకుండా స్టార్ట్ చేయడం, కామన్ ఆడియన్స్ లో దీని మీద ఆసక్తి కాస్త తగ్గడం లాంటి కారణాలు ఈ లెక్కలకు దారి తీశాయని చెప్పొచ్చు. కానీ ఫ్యాన్స్ కు కొంత నిరాశే

ఇప్పుడు వీక్ డేస్ లో ఎలాంటి రేటింగ్ వస్తుందో చూడాలి. ఒకపక్క మీలో ఎవరు కోటీశ్వరుడులో రోజు జూనియర్ ఎన్టీఆర్ దర్శనం ఉంటుంది కాబట్టి దానికి అటుఇటుగా వీక్ డేస్ లోనూ 7కి పైగా రేటింగ్ వస్తోంది. కానీ బిగ్ బాస్ కు ఆ పరిస్థితి ఉండదు. సభ్యుల పెర్ఫార్మన్స్ ని బట్టే వ్యూస్ ఆధారపడి ఉంటాయి. నాగార్జున వచ్చేది కేవలం శని ఆదివారాలే కాబట్టి అప్పుడు గ్యారెంటీ రెస్పాన్స్ ఉంటోంది. సో బిగ్ బాస్ రాబోయే 90 రోజులు ఇంటరెస్ట్ ని ఎలా నిలబెట్టుకుంటుందన్నది చాలా కీలకం. మొత్తానికి ఊహించినట్టే అంతగా బజ్ లేని బిగ్ బాస్ 5 పాత రికార్డులను బద్దలు కొట్టలేకపోయిందన్నది సంఖ్యలు చెబుతున్న వాస్తవం

Also Read: సరయు అవుట్ – హౌస్ లో హంగామా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి