iDreamPost

Bigg Boss 7: విన్నర్ ప్రైజ్​మనీలో భారీ కోత.. దక్కేది ఎన్ని లక్షలంటే..!

  • Published Dec 17, 2023 | 4:34 PMUpdated Dec 17, 2023 | 4:34 PM

బిగ్​బాస్-7 టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగితే చాలు. ఈసారి విన్నర్ ఆ కంటెస్టెంటే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బిగ్​బాస్-7 టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగితే చాలు. ఈసారి విన్నర్ ఆ కంటెస్టెంటే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • Published Dec 17, 2023 | 4:34 PMUpdated Dec 17, 2023 | 4:34 PM
Bigg Boss 7: విన్నర్ ప్రైజ్​మనీలో భారీ కోత.. దక్కేది ఎన్ని లక్షలంటే..!

గత కొన్ని వారాలుగా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్​టైన్ చేస్తూ వచ్చిన బిగ్​బాస్ సీజన్ 7 ఆఖరి అంకానికి చేరుకుంది. అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్​బాస్ ఇవాళ్టితో ముగియనుంది. ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలీ ఎపిసోడ్​లో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బిగ్​బాస్ హౌజ్​లో అమర్​దీప్​, పల్లవి ప్రశాంత్​తో పాటు శివాజీ, ప్రియాంక జైన్, అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇంత మంది కంటెస్టెంట్లు ఉన్నా ఇద్దరు మాత్రం విన్నర్స్ రేసులో ముందున్నారని టాక్. అందులో ఒకరు అమర్​దీప్ అయితే, మరొకరు పల్లవి ప్రశాంత్ అని సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరే ఈ సీజన్​లో విన్నర్ అవుతారని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అయితే సీజన్​ విన్నర్​కు దక్కే ప్రైజ్​మనీ ఎంతనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఫినాలేలో గెలిచిన వారికి ప్రైజ్​మనీ కింద రూ.50 లక్షలు ఇస్తారు. కానీ ఇందులో భారీ కోత ఉంటుందని చాలా మందికి తెలియదు.

బిగ్​బాస్ టైటిల్ గెలిస్తే రూ.50 లక్షలు విన్నర్​వేనని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఆ యాభై లక్షల్లో విజేత చేతికి వచ్చేది దాదాపుగా రూ.23 లక్షలు మాత్రమే. అవును, ఇదే నిజం. మరి అమౌంట్ లోపు మాత్రమే కంటెస్టెంట్​కు వస్తే మిగిలిన మొత్తాన్ని ఏం చేస్తారనే కదా మీ డౌట్? ఆ మిగిలిన రూ.27 లక్షలు ట్యాక్స్ అండ్ జీఎస్టీ కింద వెళ్లిపోతుంది. అవి మినహాయించాక వచ్చే రూ.23 లక్షలు టైటిల్ విన్నర్​కు అందిస్తారు. పేరుకు రూ.50 లక్షలు ప్రైజ్​మనీ అని చెప్పినా.. దక్కేది మాత్రం రూ.23 లక్షలే. అప్పట్లో బిగ్​బాస్ విన్నర్​కు రూ.50 లక్షల ప్రైజ్​మనీలో సుమారుగా రూ.13 లక్షల వరకు పన్నుల రూపంలో పోయేవి. దాదాపు రూ.37 లక్షలు విజేతకు మిగిలేవి. కానీ ఆ తర్వాత నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది.

2017 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గవర్నమెంట్ ట్యాక్స్​తో పాటు జీఎస్టీ కూడా తోడవ్వడంతో బిగ్​బాస్ విన్నర్ ప్రైజ్​మనీలో భారీగా కోత పడుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం సుమారుగా 46 శాతం పన్ను రూపంలోనే పోవడంతో రూ.50 లక్షల ప్రైజ్​మనీలో కేవలం రూ.23 లక్షలు మాత్రమే విజేతకు అందుతున్నాయి. ఇక, బిగ్​బాస్ 7 ఫినాలే ఈవెంట్​లో హోస్ట్ నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ మూవీ టీమ్ సందడి చేయడాన్ని ప్రోమోలో చూడొచ్చు. హౌజ్​మేట్స్​కు క్యాష్ ఆఫర్ చేసేందుకు సూట్ కేస్​లతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్​ బిగ్​బాస్ ఇంట్లోకి అడుగుపెట్టడం కూడా ఆ ప్రోమోలో కనిపించింది. మరి.. ఈసారి బిగ్​బాస్​ టైటిల్​ను ఎవరు గెలుచుకుంటారని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సుధీర్! సంతోషంలో ఫ్యాన్స్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి