iDreamPost

గౌతమ్- శివాజీ గొడవలో.. తప్పు ఎవరిదంటే?

బిగ్ బాస్ హౌస్ లో ఆట ఎలా ఉన్నా గొడవలు మాత్రం గట్టిగానే జరుగుతూ ఉంటాయి. నిజానికి గొడవల మధ్యలోనే టాస్కులు జరుగుతూ ఉంటాయి. తాజాగా జరిగిన గౌతమ్- శివాజీ గొడవలో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ హౌస్ లో ఆట ఎలా ఉన్నా గొడవలు మాత్రం గట్టిగానే జరుగుతూ ఉంటాయి. నిజానికి గొడవల మధ్యలోనే టాస్కులు జరుగుతూ ఉంటాయి. తాజాగా జరిగిన గౌతమ్- శివాజీ గొడవలో తప్పు ఎవరిది?

గౌతమ్- శివాజీ గొడవలో.. తప్పు ఎవరిదంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కెప్టెన్సీ పోటీదారుల కోసం టాస్కులు జురుగుతూనే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ అనగానే హౌస్ లో గొడవల మధ్యలో టాస్కులు జరుగుతూ ఉంటాయి. హాల్ ఆఫ్ బాల్ టాస్కు అయితే చాలానే గొడవలకు దారి తీసింది. బిగ్ బాస్ ఇస్తున్న స్పెషల్ పవర్స్ వల్ల గొడవలు బాగానే జరిగాయి. వీటిలో ముఖ్యంగా శివాజీ- గౌతమ్ మధ్య పెద్దగానే గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో తప్పు ఎవరిది అనే ప్రశ్న వినిపిస్తోంది. మరి.. వాళ్లిద్దరి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా టాస్కు జరగుతుంటే.. టాస్కు సమయం ముగిసిన తర్వాత ఆ వస్తువులను దాచుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ జట్టు సభ్యుల మీదే ఆధారపడి ఉంటుంది. అదే విషయాన్ని బిగ్ బాస్ కూడా వెల్లడించారు. బాల్స్ ని సూట్ కేసుల్లో పెట్టకూడదని క్లియర్ గా చెప్పారు. అందుకే గౌతమ్ వాళ్ల టీమ్ ఆ బాల్స్ ని కొట్టేయాలని ఆలోచనలు స్టార్ట్ చేశారు. అయితే శివాజీ నా వాటి జోలికి ఎవరైనా వస్తే తోలు తీసేస్తాను అంటూ కామెంట్స్ చేశాడు. అప్పుడు గౌతమ్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే వారి మద్య గొడవ స్టార్ట్ అయింది.

గౌతమ్ ఒక ఉదాహరణ చెప్పాడు. “ఇప్పుడు పెళ్లిలో చెప్పులు దాచి పెడతారు. అది దొంగతనం కాదన్నా అది టాస్కులో ఒక భాగం మాత్రమే. మీ టీ షర్ట్ తీసుకున్నా, మీ సెంట్ బాటిల్ తీసుకున్నా అది దొంగతనం అవుతుంది. ఇది పార్ట్ ఆఫ్ గేమ్ మాత్రమే అంటూ గౌతమ్ చెప్పడానికి ట్రై చేశాడు. కానీ, శివాజీ ఎక్కడా వినడానికి సిద్ధంగా లేడు. అసలు పెళ్లి అని సిల్లీ లాజిక్ ఎలా చెప్తావ్ అంటూ ప్రశ్నించాడు. అసలు సంబంధం లేని ఉదాహరణ చెప్పావ్ అంటూ సీరియస్ అయ్యాడు. నువ్వు డాక్టర్ వేగా.. ఎథిక్స్ అవి ఉండవా అంటూ ప్రశ్నించాడు. అయితే ఎక్కడా కూడా శివాజీ కన్విన్స్ అయ్యేందుకు సిద్ధంగాలేడని గౌతమ్ కి అర్థమైంది.

మధ్యలో టేస్టీ తేజా కూడా.. దొంగతనం చేయడం తప్పు అయితే అసలు బిగ్ బాస్ ఎందుకు చెప్తాడన్నా అంటూ చెప్పుకొచ్చాడు. చివరికి గౌతమ్ స్టేజ్ మీద నాగార్జున గారినే అడుగుతాను బాల్స్ దొంగతనం చేయడం తప్పా కాదా అని అంటూ ఊరుకున్నాడు. ఈ మొత్తం గొడవలో శివాజీకి టాస్కు అర్థం కాలేదు అనుకోవచ్చు. లేదంటే కావాలనే గొడవ పెట్టుకుని కూడా ఉండచ్చు. అంటే ప్రత్యర్థులు వారి వద్ద నుంచి బాల్స్ దొంగతనం చేయకుండా ఉండేదుకు ఇలా రెచ్చగొట్టి డైవర్ట్ చేశాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా చివరికి తప్పు ఒప్పు అంటే మాత్రం శివాజీ చేసింది తప్పు అనే చెప్పాలి. మరి.. శివాజీ- గౌతమ్ మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి