iDreamPost

7 ఏళ్ల క్రితమే రతిక బుల్లితెరలో ఇరగదీసింది!

7 ఏళ్ల క్రితమే రతిక బుల్లితెరలో ఇరగదీసింది!

ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అందరి దృష్టి ఒక అమ్మాయి మీద పడుతోంది. చక్కగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరినీ అలరిస్తోంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో కలిసి హౌస్ లో సరదా సరదాగా గడిపేస్తోంది. ఎక్కడున్నా కెమెరాలను తనవైపునకు లాగేసుకుంటోంది. హౌస్ లో తొలి నామినేషన్ తర్వాత ప్రియాంక జైన్ మీద కాస్త ఫైర్ కూడా అయ్యింది. ఈ అమ్మడు తెలుగమ్మాయి అనే కాదు.. చూడటానికి కూడా కాస్త ముద్దుగా ఉండంటంతో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అయితే రతిక ఇప్పుడు కాదు.. ఏడేళ్ల క్రిత్రమే బుల్లితెరలో సందడి చేసింది.

బిగ్ బాస్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రతికా రోజ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అమ్మడి మాటలు, చేతలు అన్నీ చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈమె బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది అనే మూవీ, ఇటీవల బెల్లంకొండ గణేష్ తో నేను స్టూడెంట్ సార్ అనే సినిమాలో కూడా సందడి చేసింది. కానీ, ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ విషయాన్ని రతికానే స్వయంగా స్టేజ్ మీద నాగార్జున చెప్పింది. అయితే రతిక ఇండస్ట్రీలో ఏం ప్రయత్నాలు చేసిందని ఇప్పుడు అవకాశాలు రాలేదని చెప్పడానికి అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే రతిక ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కావడం కాదు.. ఆమె ఏడేళ్ల క్రితమే బుల్లితెరలో సందడి చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

అవును.. ఆమెను చాలా మంది బుల్లితెర తెలుగు ప్రేక్షకులు చూశారు కూడా చూడటమే కాదండోయ్.. ఆమె వేసిన పంచులకు పడి పడి నవ్వుకున్నారు. ఆ చేసిన టీవీ షో మరేదో కాదు.. పటాస్ షోలో రతిక రోజ్ పాల్గొంది. అయితే అప్పుడు ఆమెకు పెద్దగా ఫాలోయింగ్ రాలేదు. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత రతిక అప్పట్లే పటాస్ లో పాల్గొంది అంటూ పాత స్క్రీన్స్ షాట్స్ ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇంక గేమ్ విషయానికి వస్తే.. రతిక రోజ్- పల్లవి ప్రశాంత్ ఒక జట్టుగా మారిపోయారు. ఎక్కడ ఉన్నా వీళ్లు ఇద్దరే కనిపిస్తున్నారు. అదే రీజన్ చెప్పి ప్రియాంక జైన్ ఇద్దరినీ నామినేట్ చేసింది. దానిని వీళ్లు సిల్లీ రీజన్ కొట్టిపారేశారు. తన నామినేషన్ రీజన్ ను యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పారు. తాము అందరితో మాట్లాడుతున్నామంటూ చెప్పుకొచ్చారు. నామినేషన్ తర్వాత ప్రియాంక జైన్.. రతిక- ప్రశాంత్ తో మాట్లాడింది కూడా. కానీ, వాళ్లు కన్విన్స్ కాలేదు. అప్పటికి ఆ డిస్కషన్ ని తెగ్గొట్టారు.

Bigg boss rathika in comedy show

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి