iDreamPost

ప్రాజెక్ట్-K నుంచి బిగ్ అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రౌడ్ మూమెంట్..!

ప్రాజెక్ట్-K నుంచి బిగ్ అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రౌడ్ మూమెంట్..!

వైజయంతి బ్యానర్ పై అశ్వినీ దత్ ప్రాజెక్ట్-k సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్- దీపికా పదుకొణె జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ ని దాటి పోయిందని అనిపిస్తోంది. అయితే పాన్ వరల్డ్ స్థాయిలో నే ఈ సినిమాని నిర్మిస్తున్నారని టాక్ అయితే ఉంది. కానీ, అందుకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ లేవు. కానీ, మొదటిసారి అలాంటి ఒక అప్ డేట్ వచ్చింది. ఈ వార్త విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకుని తిరగడం ఖాయంగా చెప్పచ్చు.

నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ లో ఉండే సూపర్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా సెట్స్ చూసిన తమ్మారెడ్డి లాంటి వాళ్లు అయితే ఈ చిత్రం తొలిరోజే రూ.500 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, క్యారెక్టర్స్ కూడా ఈ అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన అప్ డేట్ ఆ అంచనాలను కచ్చితంగా నిజం చేస్తోంది. అదేంటంటే ప్రాజెక్ట్- కే చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కామిక్- కాన్ ఫెస్టివల్ రివీల్ చేయబోతున్నారంట.

శాన్ డియాగో కామిక్- కాన్ ఇంటర్నేషనల్ ఎంత ఫేమస్ అనేది సూపర్ హీరో మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కామిక్ కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్- కే పోస్టర్, రిలీజ్ డేట్ రివీల్ చేస్తున్నారు అనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జులై 19న కామిక్ కాన్ ఫెస్టివల్ ప్రారంభం కానుండగా.. జులై 20న ప్రాజెక్ట్-కే టైటిల్, రిలీజ్ డేట్ రివీల్ చేయనున్నారు. అంతేకాకుండా ఇది కచ్చితంగా ఒక సూపర్ హీరో సినిమా అయ్యే ఉంటుంది అనే వార్తలకు ఊపందించింది.

ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ ఇలాంటి గౌరవాన్ని అందుకోలేదు. అందుకే ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా.. తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ ప్రౌడ్ మూమెంట్ అని చెబుతున్నారు. ఇంక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్, ముఖ్య పాత్రల్లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాాయి. ఈ వార్త తర్వాత అవి మరింత పెరిగాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి