iDreamPost

సరోగేట్ అడ్వర్టైజింగ్ బారిన పడ్డ బిగ్ బీ.. అసలు విషయం తెలియడంతో బైబై!

సరోగేట్ అడ్వర్టైజింగ్ బారిన పడ్డ బిగ్ బీ.. అసలు విషయం తెలియడంతో బైబై!

సినీ నటులు కొంత క్రేజ్ వచ్చాక కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటి అడ్వర్టైజ్మెంట్ లలో నటిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ ఎంతగా పెరిగిపోయాయి అంటే సినిమాల్లో సంపాదిస్తున్న దానితో సమానంగా బ్రాండ్ ప్రమోషన్స్ లో రాబడి వస్తుండడంతో ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతున్నారు స్టార్ హీరోలు. కానీ ఒక్కోసారి వాళ్లు ప్రమోట్ చేసే బ్రాండ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా పాన్ మసాలా వంటి యాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్, షారుక్ ఖాన్ అజయ్ దేవగన్ వంటి వాళ్లు పాన్ మసాలా కంపెనీ వాణిజ్య ప్రకటనలో కనపడటంతో సాధారణ ప్రేక్షకులు ముక్కున వేలేసుకునే పరిస్థితి.

తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిన గుట్కా, పాన్ మసాలా వాడకం ఎక్కువ. దాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు సహా ఎన్నో సంస్థలు పోరాడుతున్నాయి. అలాంటి సమయంలో ప్రజలను ఎంతో ప్రభావితం చేసే హీరోలు ఇలాంటి వాటిని ప్రోమోట్ చేస్తే ఊరుకుంటారా? చిన్న హీరోలను వదిలేశారు కానీ అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్ హీరో ఈ వయసులో కూడా డబ్బు కోసం అలాంటి ప్రకటనల్లో నటించడం అవసరమా అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే అమితాబ్ బచ్చన్ ఈ యాడ్ లో నటించడం వెనుక ఒక మతలబు ఉంది. ఒకరకంగా ఆయనకు తెలియకుండానే బురిడీ కొట్టించారు. దానిని సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే ప్రకటనలో చూపించేది ఒకటి, అసలు ఉండేది ఒకటి. లిక్కర్ కి ప్రమోషన్ అనేది భారతదేశంలో చట్ట ప్రకారం చేయకూడదు. గమనించినట్లయితే లిక్కర్ కి సంబంధించిన ప్రకటనలలో ఎక్కువగా మ్యూజిక్ సిడిలు లేదా సోడా బాటిల్ ను ప్రమోట్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక అమితాబ్ బచ్చన్ విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు.

అమితాబచ్చన్ వద్దకు కమలా పసంద్ అనే ఒక మౌత్ ఫ్రెషనర్ ప్రమోట్ చేయాలని కోరుతూ కొంతమంది వచ్చారు. మౌత్ ఫ్రెషనర్ కావడంతో ఆయన కూడా ప్రమోట్ చేయడానికి అంగీకరించారు. తీరా షూటింగ్ పూర్తయి అమితాబ్ డబ్బులు అమితాబ్ కి ముట్టాక అది మౌత్ ఫ్రెషనర్ పేరుతో కాకుండా పాన్ మసాలా పేరుతోనే జనాల్లోకి వెళ్ళింది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున దుమారం రేగడంతో యాంటీ టొబాకో బోర్డు కూడా అమితాబ్ బచ్చన్ కి లేఖ రాసిన పరిస్థితి. తరువాత ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావడంతో ఎట్టకేలకు అమితాబచ్చన్ యాడ్ నుంచి తప్పుకుంటూ యాడ్ చేసినందుకు తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలుగులో కూడా మహేష్ బాబు ఇదే తరహా యాడ్లో కనిపిస్తున్నారు. ఆయన టైగర్ ష్రాఫ్ తో కలిసి యాడ్లో కనిపించారు

Also Read : పాన్ ఇండియా దర్శకుడికి ఆఫర్ల వర్షం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి