iDreamPost

మహిళలకు అలర్ట్.. ఇలా చేయకపోతే RTC బస్సులో టికెట్ కొనాల్సిందే

Alert On Free Bus Servie: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణానికి కూడా కొన్ని షరతులు ఉంటాయని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Alert On Free Bus Servie: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణానికి కూడా కొన్ని షరతులు ఉంటాయని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

మహిళలకు అలర్ట్.. ఇలా చేయకపోతే RTC బస్సులో టికెట్ కొనాల్సిందే

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మహిళలు అందరూ టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన మహిళలు అంతా ఉచితంగానే ప్రయాణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా నిర్ణీత సర్వీసుల్లో ప్రాయణం చేయవచ్చు. అయితే ఈ ఫ్రీ బస్సు సర్వీసుకు కొన్ని షరతులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనారు మరింత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయకపోతే మాత్రం మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనాల్సిందే.

సాధారణంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అనగానే అందరు మహిళలకు అందిస్తారు అనుకున్నారు. కానీ, కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా రాష్ట్రానికి చెందిన మహిళలకు మాత్రమే బస్సులో ఫ్రీ బస్సు జర్నీ అనేది కల్పిస్తారు. బస్సులో ఎక్కిన సమయంలో మహిళలు తప్పనిసరిగా వారి ఆధార్ ను చూపించాల్సి ఉంటుంది. వాళ్లు తెలంగాణకు చెందిన మహిళలు అయితేనే బస్సులో ఫ్రీ జర్నీ సాధ్యపడుతుంది. లేదంటే వాళ్లు కూడా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇటీవల కొందరు ఆధార్ చూపించేందుకు నిరాకరించడం, ఇంకొందరు ఒరిజినల్ కాపీ కాకుండా.. సాఫ్ట్ కాపీని చూపించడం చేస్తున్నారు. ఇంకొందరు టికెట్ తీసుకోమని చెప్పిన కండెక్టర్లతో వాగ్వదానికి కూడా దిగుతున్నారు. ఈ మొత్తం నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయదలిచిన మహిళలు కచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డును చూపించాలని కోరారు. అలా కాకుండా సాఫ్ట్ కాపీ చూపించినా.. అసలు ఆధార్ చూపించకపోయినా కూడా టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు.

టికెట్ కోసం చెకింగ్ చేసే సమయంలో ఒరిజినల్ ఆధార్ లేకుండా.. టికెట్ తీసుకోకుండా ఉన్న మహిళలకు తప్పకుండా రూ.500 ఫైన్ విధిస్తామని వెల్లడించారు. ఇకపై మహిళలు తప్పనిసరిగా ఆధార్ ఒరిజినల్ కాపీని చూపించే ఉచిత ప్రయాణం చేయాలని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరగడం మాత్రమే కాకుండా.. బస్సుల్లో రద్దీ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంపై కూడా ఎండీ సజ్జనార్ స్పందించారు. త్వరలోనే 2050 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఈ కొత్త బస్సులను విడతల వారీగా ప్రవేశ పెడతామని చెప్పారు. కొత్తగా తీసుకొస్తున్న 2,050 కొత్త బస్సుల్లో 1050 బస్సులు డీజిల్ వి కాగా.. 1000 మాత్రం ఎలక్ట్రిక్ బస్సులని తెలిపారు. ఈ కొత్త బస్సులతో భాగ్యనగరంలో ప్రయాణికులకు కాస్త ఊరట లభిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే తప్పుకుండా ఆధార్ కార్డును కూడాతీసుకెళ్లాలనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. అలా తీసుకవెళ్లకపోతే తప్పకుండా టికెట్ కొనుగోలు చేయండి. లేదంటే మీరు రూ.500 ఫైన్ కట్టాల్సి వస్తుంది. మరి.. ఈ ఆర్టికల్ ని మీ బంధు మిత్రులకు షేర్ చేసి వారిని కూడా ఒకసారి అలర్ట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి